PhonePe: టీ తాగినా, వస్తువులు కొనుగోలు చేసినా ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే. డబ్బులు చెల్లించగానే స్పీకర్ లో నగదు జమయిందనే వాయిస్ వస్తూంటుంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఫోన్ పే (PhonePe) వినూత్నంగా ఆలోచించింది. ఇకపై ప్రతి చెల్లింపుకు దుకాణాల్లోని స్మార్ట్ స్పీకర్లకు సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) వాయిస్ తో ‘ధన్యవాదాలు బాస్’ అనే మాట వినిపించనుంది.
ఇందుకు ఫోన్ పే ప్రతినిధులు మహేశ్ వాయిస్ తీసుకుని దానికి ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన వాయిస్ జనరేట్ చేశారని తెలుస్తోంది. దీంతో పేమెంట్ రిసీవ్డ్ కు బదులుగా ‘ధన్యవాదాలు బాస్’ అంటూ మహేశ్ వాయిస్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో మహేశ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. నెటిజన్లు కూడా ఇదొ సరదా ప్రయోగం.. బాగుందంటున్నారు.
గతేడాది అమితాబ్ బచ్చన్ వాయిస్ ను జోడించిన ఫోన్ పే.. తెలుగులో మహేశ్, మలయాళంలో మమ్ముట్టి.. కన్నడలో సుదీప్ తో ఈ వాయిస్ వినిపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.