Switch to English

మహేష్‌ మూవీలో ముద్దుగన్‌ పిల్ల

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 27వ చిత్రం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అన్నారు. కాని వంశీ రెడీ చేసిన కథ తనకు సూట్‌ అవ్వదనే ఉద్దేశ్యంతో ఆ ప్రాజెక్ట్‌ ను పక్కకు పెట్టాడు మహేష్‌ బాబు. తదుపరి చిత్రాన్ని పరశురామ్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా వార్తలు అయితే జోరుగా వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. పరశురామ్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన డ్రీమ్‌ నిజం కాబోతుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. కనుక మహేష్‌ తో సినిమా కన్ఫర్మ్‌ అయినట్లే అంటున్నారు.

అధికారిక ప్రకటన రాకున్నా కూడా మహేష్‌ బాబు, పరశురామ్‌ల కాంబో మూవీ కన్ఫర్మ్‌ అయ్యింది. ఇక ఆ సినిమా గురించి కథ గురించి మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ పుకారు ఒకటి వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా మలయాళి ముద్దుగన్‌ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈమె మొదటి సినిమా ఒరు ఆదార్‌ లవ్‌ చిత్రం నిరాశ పర్చడంతో సినిమాలకు కమిట్‌ అయ్యే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

తాజాగా ఈ అమ్మడుని మహేష్‌ సినిమా కోసం మేకర్స్‌ సంప్రదించారని వెంటనే ఒప్పేసుకుందని సమాచారం. అతి త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మహేష్‌ బాబుకు జోడీగా ప్రియా ప్రకాష్‌ చక్కగా సెట్‌ అవుతుందని ఫ్యాన్స్‌ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే ఇద్దరి మద్య మాత్రం వయసు తేడా ఎక్కువగా ఉంటుందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 30 ఏళ్ల వయసు తేడాతో కూడా హీరో హీరోయిన్స్‌ నటించిన దాఖలాలు చాలా ఉన్నాయి. మహేష్‌, ప్రియా ప్రకాష్‌ల మద్య వయసు తేడా పెద్ద తేడానే కాదు అంటూ మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: కలకలం రేపుతున్న బావిలో మృతదేహాలు

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ వరుసగా మృతదేహాలు బయటపడడం ఆ ప్రాంతంతో తీవ్ర కలకలం రేపుతోంది. ముందురోజు నాలుగు మృతదేహాలు లభ్యమవగా.. ఈ రోజు ఉదయం మరో మూడు మృతదేహాలు...

పిక్ ఆఫ్ ది డే: స్విమ్మింగ్ పూల్ లో సరదాగా.. మహేష్ బాబు.!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ లాక్ డౌన్ టైంలో తన పిల్లలైన గౌతమ్ అండ్ సితారలతో క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్నారు. వారితో కలిసి గేమ్స్ ఆడటం, వారితో కలిసి సినిమాలు...

త్వరలోనే విజయవాడకు జనసేనాని – దూకుడుగా వెళ్లడమే మంత్రం.!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూనే ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా తనదైన తరహాలో సాయం చేస్తున్నారు. ఇక జనసైనికులైతే గ్రామ స్థాయిలో...

బీహార్ బాలిక సాహసానికి ఇవాంకా ఫిదా.!

ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించిన 15 ఏళ్ల బీహార్ బాలికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్...

బాలయ్య – బోయపాటి.. ఓ సస్పెన్స్ డ్రామా

నందమూరి బాలకృష్ణ - సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనులది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ మొదట కలిసి చేసిన సింహా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ ఇద్దరూ...