చూస్తుంటే మన నటులు అందరూ సర్జరీల బాట పడుతున్నారు. ఎన్టీఆర్ ఎడమ చేతి వేలికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెల్సిందే. ఆయన కొన్ని రోజుల నుండి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. చిరంజీవి కూడా సర్జరీ కారణంగా ఒక నెల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు బాబీ చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టాడు.
అలాగే నందమూరి బాలకృష్ణ షూటింగ్ లో ఎడమ భుజానికి జరిగిన గాయానికి చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం పబ్లిక్ లో హ్యాండ్ కు సపోర్ట్ తోనే కనిపిస్తున్నారు. రెండు వారాల పాటు రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇదే కోవలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వెళ్లనున్నట్లు సమాచారం.
ఆయనకు గత కొంత కాలంగా మోకాలి నొప్పి వేధిస్తోంది. రీసెంట్ గా డాక్టర్ ను సంప్రదించి శాశ్వత పరిష్కారంగా శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ ను పూర్తి చేసాక ఈ సర్జరీ చేయించుకుంటాడని దాని తర్వాత రెండు నెలల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది.
557429 944374I used to be recommended this internet site by my cousin. Im no longer confident whether this put up is written by way of him as nobody else know such exact approximately my difficulty. You are remarkable! Thank you! 298301