Mahesh Babu: ‘కొణిదెల నిహారిక’ నిర్మాతగా యదు వంశీ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘కమిటీ కుర్రాళ్లు’. ఇటివలే విడుదలైన సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. రోజురోజుకీ ప్రేక్షకాదరణ పెరుగుతూ ధియేటర్లలో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. ఇప్పుడీ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ స్పందించారు. నిహారికకు అభినందనలు తెలియజేస్తున్న పోస్ట్ వైరల్ అవుతోంది.
‘కమిటీ కుర్రోళ్లు సినిమా గురించి మంచి మంచి రిపోర్ట్స్ వింటున్నా. సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన నిహారిక తొలి సినిమాతోనే విజయం సాధించడం అభినందనీయం. నీకు కంగ్రాట్స్. త్వరలోనే సినిమా చూస్తా’నని మహేశ్ పోస్ట్ చేశారు. దీంతో మెగా, మహేశ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
గ్రామీణ వాతావరణం, స్నేహితులు, బాల్యం, జాతర, ఊరి రాజకీయాల నేపథ్యంలో భావోద్వేగాల మధ్య తెరకెక్కించిన సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా సక్సెస్ కావడంతో సోమవారం నుంచి ధియేటర్స్ పెంచుతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. తన జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఒకటి కమిటీ కుర్రోళ్లు సినిమా నిర్మించడమని నిహారిక తెలపడం విశేషం.
Hearing great things about #CommitteeKurrollu!
Congratulations @IamNiharikaK on your debut production and the entire team on its success! Look forward to watching it soon 👍👍 @yadhuvamsi92 @eduroluraju @anudeepdev— Mahesh Babu (@urstrulyMahesh) August 12, 2024