Switch to English

మహేష్ నెక్స్ట్ సినిమా .. టెన్షన్లో ఫాన్స్ !!

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా విషయంలో ప్రసుతం చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. లేటెస్ట్ గా సరిలేరు నీకెవ్వరూ అంటూ సంక్రాంతి కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనుకున్న మహేష్ కి ఆ సినిమా కాస్త డిస్సప్పాయింట్ చేసింది. దాంతో నెక్స్ట్ సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. నిజానికి మహేష్ నెక్స్ట్ సినిమా మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లి తో ఓకే చేసేసాడు. దాంతో రంగంలోకి దిగి స్క్రిప్ట్ , ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టాడు వంశీ. అయితే ఉన్నట్టుండి ఏమైందో ఏమో .. ఈ సినిమా ఆగిపోయింది అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మద్యే దర్శకుడు సుకుమార్ తరహాలోనే మహేష్ నెక్స్ట్ సినిమా విషయంలో దర్శకుడు వంశీ కి షాక్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు.

దానికి ప్రత్యేక కారణాలు అంటూ ఏమి లేవట .. అయితే వంశీ చెప్పిన కథ బాగున్నప్పటికీ, స్క్రిప్ట్ పరంగా మహెష్ సంతృప్తిగా లేకపోవడంతోనే ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టాడని అంటున్నారు. ఇక నెక్స్ట్ సినిమా కోసం గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తో సినిమాకు ఓకే చెప్పాడట? దాంతో పాటు మహేష్ కోసం ఇప్పటికే పలువురు దర్శకులు లైన్ లో ఉన్నారు. అందులో శ్రీను వైట్ల కూడా ఉన్నాడట, ఇప్పటికే మహేష్ కు శ్రీను వైట్ల ఓ కథ కూడా చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ సినిమా విషయంలో మహేష్ ఇంకెలాంటి నిర్ణయం చెప్పలేదట. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా దూకుడు సినిమా ఇచ్చిన శ్రీను వైట్ల ఆ తర్వాత వెంటనే ఆగడు అంటూ ఓ భారీ డిజాస్టర్ ని ఇచ్చాడు. ఆ సినిమా తరువాత శ్రీను వైట్ల కు ఛాన్సులు తగ్గాయి. ఆ తరువాత చేసిన సినిమాలు కూడా వరుస ప్లాపులుగా మిగలడంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి.

ఆయనతో పాటు గరుడ వేగా ఫెమ్ ప్రవీణ్ సత్తారు కూడా మహేష్ కు ఇటీవలే ఓ కథ చెప్పాడట. కథ నచ్చడంతో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మొత్తానికి మహేష్ ఇలా వరుసగా దర్శకులకు ఓకే చెప్పడంతో అయన ఫాన్స్ లో టెన్షన్ మొదలైంది. అయితే మహేష్ నెక్స్ట్ సినిమా ఏదన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్‌: నష్టం కోట్లలోనే.!

రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. నెల రోజులపాటు పండగ వాతావరణం కన్పిస్తుంటుంది. కరోనా వైరస్‌ దెబ్బకి రంజాన్‌ ఈసారి వెలవెలబోతోంది. ఇది హైద్రాబాద్‌ పరిస్థితి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ...

టీం సేఫ్టీ కోసం అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్.!

ఇండస్ట్రీ హిట్ 'అల వైకుంఠపురములో', బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నఅల్లు అర్జున్, సుకుమార్ కలిసి సినిమా చేయనున్నారు అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్...

ఫ్లాష్ న్యూస్: ఎమ్మెల్సీ కొడుకుని అని గృహినికి టోకరా

భరత్ కుమార్ అనే వ్యక్తి తనకు తానుగా ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం చేసుకుని ఒక గృహిణిని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ కేసును ఘట్కేసర్ పోలీసులు నమోదు చేసి విచారణ...

ఫ్లాష్ న్యూస్: వారెవ్వా.. తల్లి కోసం ఐదేళ్ల బాలుడు ఒంటరి ప్రయాణం.!

కరోనా మహమ్మారిని అడ్డుకోవడం కోసం ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో మార్చి లో లాక్ డౌన్ పెట్టడం వలన ఎక్కడి వారు అక్కడే లాక్ అయిపోయారు. చాలా మంది స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నించి లాభం...

వారి కోసం అయినా షూటింగ్స్‌కు అనుమతించాలి : చిరంజీవి

తెలుగు సినిమా ప్రముఖులు నేడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో చిరంజీవి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు విషయాలపై చర్చించారు. సినీ కార్మికులు రెండు నెలలుగా షూటింగ్స్‌...