టాలీవుడ్‌లో అందరి కళ్లూ ప్రస్తుతం మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌పై ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ దశలోకి అడుగుపెట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ గురించి ఒక్కో అప్‌డేట్ బయటికి వస్తే అభిమానులంతా షేకవుతున్నారు. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన మరో గాసిప్ ఫ్యాన్స్‌ని ఆకాశానికెత్తేస్తోంది.
ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీ రాముడి గెటప్‌లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు, ఆ లుక్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికే షూట్ అయిపోయాయని కూడా అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఈ రూమర్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
‘మహేష్.. రాముడిగా తెరపై కన్పిస్తే.. ఫాన్స్ కి ఇక పూనకాలే అన్నట్టు ఉంటుంది. రాజమౌళి తన సినిమాల్లో మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్‌లు చూపించడం సహజం. అలాంటిది మహేష్‌ని రాముడి గెటప్‌లో చూపిస్తే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో అనుకోవడం కూడా ఫ్యాన్స్‌ని ఉత్సాహపరుస్తోంది.
ఒకవేళ ఈ రూమర్ నిజమే అయితే.. మహేష్ బాబు – రాజమౌళి సినిమా టాలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం భారతీయ సినిమాకు మరో లెవల్ రేంజ్ సెట్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
