సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. ఎంత బిజీగా ఉన్నా సరే గ్యాప్ దొరికితే తన కూతురుతో ఏదో ఒక ఈవెంట్ లేదా ఫంక్షన్ కు హాజరవుతూనే ఉంటారు. అయితే తొలిసారి మహేశ్ బాబు తన కూతురుతో కలిసి ఓ యాడ్ లో నటించారు. అది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంది. ట్రెండ్స్ సంస్థ కోసం మహేశ్, సితార కలిసి యాడ్ చేశారు. ఇది బాగా ట్రెండ్ అవుతోంది. అయితే ఇదే యాడ్ షూట్ లో భాగంగా వారిద్దరూ కొన్ని స్టిల్స్ కూడా ఇచ్చారు.
అవి ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ రెండు స్టిల్స్ లో మహేశ్, సితార చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇందులో మహేశ్ బాబు గడ్డం, మీసాలతో షార్ప్ గా కనిపిస్తున్నారు. సితార కూడా నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. ఇంకేముంది ఫ్యాన్స్ ఈ రెండు ఫొటోలను సోషల్ మీడియాలో తెగ పోస్టు చేస్తున్నారు. గడ్డం, మీసాలతో మహేశ్ అందం మరింత పెరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక యాడ్ షూట్ లో సితార తెలుగులో మాట్లాడటం కూడా అందరితో ప్రశంసలు అందుకునేలా చేసింది. మహేశ్ కు తగ్గ వారసురాలు అవుతుందంటూ ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు.