సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి చిత్రం ఈ నెల 9న విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అప్పుడే హౌస్ ఫుల్స్ అయ్యాయి. అయితే ఎక్స్ట్రా షోల కోసం ఈ సినిమా టికెట్స్ ని 200 రూపాయలు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందట. జనరల్ గా 60 – 100 రూపాయలు ఉన్న టికెట్స్ ఒక్కసారిగా 200 పెంచుకోవచ్చంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.
ఈ రోజుల్లో సినిమా చూడాలంటేనే సామాన్య జనం టెన్షన్ పుడుతున్న సమయంలో ఇలా ఒక్కో టికెట్ ని 200 పెంచేస్తూ దోచుకోవడం ఏమిటి ? అంటూ జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు. సినిమా విడుదల సమయంలో 200 రూపాయల టికెట్ పెడితే సామాన్య ప్రేక్షకుడు థియేటర్ కు ఎలా వస్తాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే ఈ ప్రొపోజల్ ని తెలంగాణ ప్రభుత్వానికి పెట్టారు. అయితే ఈ విషయంలో టీఎస్ ప్రభుత్వం ఇంకా పర్మిషన్ రాలేదు. మొత్తానికి మహర్షి సినిమా విషయంలో ఇలా డబుల్ రేట్స్ పెంచేసి టికెట్స్ అమ్మడంతో అటు మహేష్ ఫాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఇలా ఎక్స్ట్రా షోస్ కోసం ఎక్స్ట్రా టికెట్స్ రేట్స్ పెంచేస్తే మిగతా సినిమాలు కూడా అలాగే పెంచేసి సామాన్య జనాల నడ్డి విరుస్తాయని రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ విషయం పై నిర్మాతలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.