Farmer: దుక్కి దున్ని, ఆరుగాలం కష్టించే రైతుకే తెలుసు పంట విలువ. రేటు రాకపోయినా తర్వాతి పంట పండించేందుకు సిద్ధమయ్యే నిజమైన అన్నదాత. అటువంటి రైతుకే కష్టం వస్తే సమాజానికి మంచిది కాదు. అలా ఓ రైతు తాను పండించిన పంట నీటీపాలైతే.. కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహన్ కు చేరింది. స్పందించిన మంత్రి రైతుతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పడం అందరి హృదయాల్నీ గెలుచుకుంది. అధైర్యపడొద్దు.. మేమున్నామనే మాట ఆ రైతుకు ఎనలేని ఆనందాన్నిచ్చింది. దీనిని మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..
మహరాష్ట్రకు చెందిన రైతు గౌరవ్ పన్వార్ తాను పండించిన వేరుశనగ పంటను అమ్మేందుకు వాషిమ్ మార్కెట్ యార్డుకు వెళ్లాడు. అకాల వర్షంతో పంట నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రైతు కొట్టుకుపోతున్న పంటను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. హృదయవిదారకమైన వీడియోలో రైతు ఆవేదన, తాపత్రయం అందరినీ కలచి వేసింది.
सोशल मीडिया पर महाराष्ट्र के किसान भाई श्री गौरव पंवार जी का मार्मिक वीडियो देखकर हृदय विचलित हो गया।
असमय बारिश ने मंडी में रखी उनकी मूंगफली की फसल को बर्बाद कर दिया। किसान होने के नाते मैं इस पीड़ा को भली प्रकार समझ सकता हूं। मैंने गौरव जी से फोन पर बात की, उन्हें ढांढस… pic.twitter.com/gGn6a3BuMi
— Office of Shivraj (@OfficeofSSC) May 18, 2025
