మహారాష్ట్రలో ఉద్దవ్ థాక్రే ను గద్దె దించి సీఎం అయిన ఏక్ నాథ్ షిందే ఖచ్చితంగా ఆరు నెలల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండడు అంటూ పశ్చిమ బెంగాళ్ సీఎం మమత బెనర్జీ అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ అనైతిక అప్రజాస్వామ్య సర్కారును నెలకొల్పుతున్నారు అంటూ మమత బెనర్జీ ఆరోపించారు. ఇండియా టుడే నిర్వహించిన ఒక కార్యక్రమంలో మమత మాట్లాడారు. ఆ సందర్బంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రజల అభిష్టంకు విరుద్దంగా మహా ప్రభుత్వం ఏర్పడింది. ఖచ్చితంగా అతి త్వరలోనే ప్రభుత్వం యొక్క అనిశ్చితి బయట పడుతుంది.. తద్వారా మహా ప్రభుత్వం కుప్పకూలుతుందని జోష్యం చెప్పింది. బీజేపీ చేస్తున్న వారసత్వ రాజకీయాలపై కూడా మమత స్పందించారు. తన మేనల్లుడు రాజకీయాల్లోకి వస్తే ఎవరికి నష్టం జరిగింది అంటూ ఆమె ప్రశ్నించింది. అమిత్ షా తనయుడు రాజకీయాల్లో ఉంటే రాని నష్టం నా మేనల్లుడి వల్ల వచ్చిందా అంటూ ఆమె ప్రశ్నించింది.