Switch to English

‘మహాసముద్రం’ మూవీ రివ్యూ

Critic Rating
( 2.75 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

Movie మహా సముద్రం
Star Cast శర్వానంద్ , siddarth
Director అజయ్ భూపతి
Producer రామ్ సుంకర
Music చేతన్ భరద్వాజ్
Run Time 2 hr 36 Mins
Release 14 October 2021

శర్వానంద్ కు ఈమద్య కాలంలో సక్సెస్ లు లేవు.. ఇక సిద్దార్థ ఈమద్య కాలంలో తెలుగు లో సినిమాలే నటించలేదు. అలాంటి వీరిద్దరితో ఆర్‌ ఎక్స్ 100 వంటి సినిమాతో అయిదేళ్ల క్రితం సక్సెస్ దక్కించుకున్న అజయ్‌ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

అర్జున్‌(శర్వానంద్‌) మరియు విజయ్‌(సిద్దార్థ్‌) లు మంచి స్నేహితులు. మహా(అధితి) తో విజయ్‌ ప్రేమలో ఉంటారు. కొన్ని అనూహ్య పరిణామాల వల్ల విజయ్‌ నాలుగు ఏళ్ల పాటు అందరికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో విజయ్ ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియదు. నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన విజయ్ ఎదుర్కొన్న పరిణామాలు ఏంటీ.. అసలు విజయ్ ఊరు వదిలి వెళ్లడానికి గల కారణాలు ఏంటీ.. స్నేహితులు శత్రువులుగా ఎందుకు మారారు అనేది కథ.

నటన :

శర్వానంద్ మరియు సిద్దార్థ్ లు ఇద్దరు కూడా అద్బుతంగా నటించారు. వారిద్దరు కనిపించకుండా అర్జున్ మరియు విజయ్‌ లు కనిపించారు. వారు పోటీ పడి నటించారు. నటించడానికి చాలా స్కోప్‌ ఉన్న పాత్రలు వారికి దక్కాయి. ఆ అవకాశంను వారు సరిగ్గా ఉపయోగించుకున్నారు. సినిమాకు వారిద్దరు కూడా ప్రథాన ఆకర్షణగా నిలిచారు. ఇక హీరోయిన్స్‌ గా నటించిన అథితి రావు హైదరి మరియు అను ఎమాన్యూల్‌ లు కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అథితి ఆకట్టుకునే నటనతో మెప్పించింది. కథ మొత్తం కూడా ఆమె చుట్టు తిరుగుతూ ఉంటుంది. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇతర పాత్రల్లో కనిపించిన రావు రమేష్‌ మరియు జగపతి బాబు కూడా అద్బుతంగా నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు అజయ్‌ భూపతి తాను చెప్పాలనుకున్న కథను ఎంపిక చేసిన పాత్రలతో అద్బుతంగా చెప్పాడు. అతడు కథలోని పాత్రలను మలచిన తీరు కూడా చాలా బాగుంది. సినిమా మొదటి సగం చాలా బాగా వచ్చింది. ఇంటర్వెల్‌ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఇవ్వడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. కాని సెకండ్‌ హాఫ్ పై మాత్రం అజయ్ ఇంకాస్త బెటర్ గా వర్క్ చేయాల్సి ఉండేది. ఫస్ట్‌ హాఫ్‌ సాగినట్లుగా సెకండ్ హాఫ్ సాగినట్లయితే సినిమా మరో లెవల్ లో ఉండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా ఉంది. సన్నివేశాల స్థాయిని పెంచేలా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ ఉంది. పాటల విషయంలో గొప్పగా చెప్పుకోవడానికి లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని విజువల్స్‌ ను చాలా నాచురల్‌ గా ఆకట్టుకునే విధంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు మనహా అంతా బాగానే ఉంది.

ప్లస్‌ పాయింట్స్ :

  • పాత్రలను ప్రజెంట్‌ చేసిన తీరు,
  • బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ మరియు సినిమాటోగ్రపీ,

మైనస్‌ పాయింట్స్ :

  • సెకండ్‌ హాఫ్‌,
  • స్క్రీన్‌ ప్లే,

విశ్లేషణ : దర్శకుడు స్క్రిప్ట్ పై దాదాపుగా రెండున్నర మూడు సంవత్సరాలు వర్క్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఫస్ట్‌ హాఫ్ వచ్చింది. హీరోలు ఇద్దరు మరియు రావు రమేష్ మరియు జగపతిబాబుల పాత్రలు ఇంకా అథితి రావు పాత్రలను అతడు చూపించిన తీరు అద్బుతం అనడంలో సందేహం లేదు. కాని సెకండ్‌ హాఫ్‌ విషయంలో అతడు పూర్తిగా పట్టు కోల్పోయాడు అనిపించింది. మొత్తంగా సినిమా ఆకట్టుకుంది. సినిమా చూడదగ్గదిగా ఉంది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సన్నాఫ్‌ ఇండియా మళ్లీ వచ్చేశాడు… చూస్తారా?

మంచు ఫ్యామిలీ ఈమద్య కాలంలో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వారు వార్తల్లో నిలిచిన ప్రతి సారి సోషల్‌ మీడియాలో వారిపై జోకులు.. మీమ్స్...

బాలయ్య సినిమాలో మాస్ ఖిలాడీ ఐటెం సాంగ్‌

అఖండ సినిమాతో సక్సెస్‌ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా...

శేఖర్ తో వింటేజ్ రాజశేఖర్ ను చూస్తారట

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్ ను చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాలో చూడబోతున్నాం అంటూ శేఖర్ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయన అభిమానులకు...

లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది....

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు చిత్ర అప్డేట్స్!

గని చిత్రంతో తన కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. చాలా హుందాగా ఈ ప్లాప్ ను ఒప్పుకుని తన తర్వాతి...

రాజకీయం

గెలిచిన ఏబీవీ.! వీగిపోయిన వైసీపీ అహం.!

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా పనిచేసిన సీనీయర్ ఐపీఎస్ అధికారి మీద వైసీపీ అధికారంలోకి వస్తూనే సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనీ, ఏకంగా...

సీట్లు ఇచ్చినంత మాత్రాన వైకాపాను బీసీలు నమ్మేనా?

వైకాపా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు ఇచ్చామని.. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా బీసీలకు మెజార్టీ సీట్లు ఇస్తూ వారికి గౌరవంను గుర్తింపును ఇవ్వడంతో పాటు వారి...

పార్టీలన్నీ బీజేపీ అనుబంధ పార్టీలే : పాల్‌

గత ఎన్నికల్లో ఏపీలో హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్‌ ఈసారి తెలంగాణలో హడావుడి చేస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో జరుగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తో...

ఏపీ రాజ్యసభకి తెలంగాణ రంగు: ఆ ఇద్దరూ ఏపీ తరఫున నిలబడతారా.?

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయ్. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయ్. ఆ నాలుగు సీట్లకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అందులో ఇద్దరు బీసీలు...

సోది ఆపండి.! ప్రజలు పారిపోతున్నారు ముఖ్యమంత్రిగారూ.!

డబ్బులిచ్చి జనాన్ని తీసుకొస్తే మాత్రం, నాయకులు చెప్పే పనికిమాలిన సోది వింటూ కూర్చుంటారా.? ఛాన్సే లేదు. గతంలో చాలామంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిథులు, కీలక పదవుల్లో వున్నవారికీ ఇలాంటి చేదు అనుభవాలే...

ఎక్కువ చదివినవి

కొత్త పెళ్లి కొడుకు ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్ సిల్లీ రీజన్‌

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ కు చెందిన సమాధాన్ సాబ్లే అనే 24 ఏళ్ల నూతన వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్య స్థానికంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈతరం యువకులు కుర్రాళ్లు...

ఆచార్య ఓటిటి విడుదల ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ రిలీజ్ ఆచార్య ఫుల్ రన్ ను పూర్తి చేసుకుంటోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. దాదాపు 130 కోట్లకు పైగా బిజినెస్...

బాలీవుడ్ కామెంట్స్ విషయంలో మహేష్ ను సపోర్ట్ చేసిన కంగనా

సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన బాలీవుడ్ కామెంట్స్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా దీనిపై రచ్చ చేస్తూనే ఉంది. మహేష్ తనకు అలాంటి ఉద్దేశం...

ప్రాజెక్ట్ కె విషయంలో కీలక అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె.  ఇండియన్ సినిమాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది....

విజయ్ – సమంత చిత్రంపై పవన్ ఫ్యాన్స్ గుస్సా

విజయ్ దేవరకొండ, సమంత లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం ప్రస్తుతం కాశ్మీర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసారు....