Switch to English

మైమరిపించిన మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్ షో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,050FansLike
57,202FollowersFollow

మాస్ట్రో ఇళయరాజా లైవ్ షోకి హైదరాబాద్ మరోసారి వేదికయింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇళయరాజా లైవ్ షో సంగీత ప్రియులని, అభిమానులని అలరించింది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో లైవ్ షో ప్రారంభమయి ఇళయరాజా పాడిన జననీ జననీ పాటతో మొదలైన మ్యూజికల్ ట్రీట్ ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తిక్ పాడిన ఓం శివోహం పాట ప్రేక్షకుల్లో గొప్ప ఉత్సాహాన్ని తెచ్చింది.

ఎన్నో రాత్రులోస్తాయిగానీ, మాటే మంత్రము, కలయా నిజమా పాటలని ఇళయరాజా స్వయంగా ఆలపించి అలరించారు. ఈ లైవ్ షో లో దాదాపు 35 పాటలు అలపించగా రీటెకులు, అపశ్రుతులు దొర్లకుండా లైవ్ షో ని కండక్ట్ చేయడంలో ఇళయరాజా మరోసారి తన మార్క్ చూపించారు.

మనో, ఎస్పీ చరణ్ .. బాలు లేని లోటుని తీర్చడానికి తమ శక్తి మేరకు ప్రయత్నించగా కార్తిక్, శరత్ లు ఆకట్టుకున్నారు. చివర్లో సింగారాల పైరుల్లోన పాట స్టేడియంని సందడిగా చేసింది. ఫిమేల్ సింగర్స్ విభావరి, శ్వేత, సునీత, శీరిష, అనిత తమ గాన మాధుర్యం తో అలరించారు.

ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఏళ్ళు గడుస్తున్నా అందులో వున్న ఫ్రెష్ నెస్ కొంచం కూడా తగ్గదు, ఎన్ని సార్లు విన్నా అదే ఎమోషన్ కనెక్ట్ అవుతుంది అందుకేనేమో ఆయన్ని మ్యూజికల్ గాడ్ అంటారు.

ఒక పాట తయారీ వెనుక ఎలాంటి శ్రమ వుంటుంది ? ఎంత సృజన అవసరమో .. ఓ ప్రియ ప్రియ.. పాటలో వచ్చే ఒక ఇంటర్వ్యూ తో ప్రేక్షకులకు వివరించారు రాజా. ఎన్ని లేయర్లలో వర్క్ జరుగుతుందో చెప్పి.. ఇలా సంగీతాన్ని ప్రేక్షకులకు చెప్పే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా వున్నారా ? అని ప్రశ్నించి.. ‘ఎవరు లేరు..నేను మాత్రమే ఇలా చెప్తాను’ అని ఇచ్చిన సమాధానంతో మైదానంలో చప్పట్లు మారుమ్రోగాయి.

మైమరిపించిన మ్యాస్ట్రో  ఇళయరాజా లైవ్ షో

ఎనభై ఏళ్ల వయసులో మూడున్నర గంటల పాటలు ఒక్క సెకన్ కూడా కూర్చోకుండా ఆయన లైవ్ కండక్ట్ చేయడం అందరినీ సర్ప్రైజ్ చేసింది.

ఇళయరాజా లైవ్ షో అంటే బాలు వుంటే ఆ సందడే వేరు. పాటలతో పాటు మంచి సరదా కబుర్లు వుంటాయి. ఇళయరాజాని.. ఏరా అని పిలిచే చనువు బాలుకుంది. రాజా మ్యూజిక్ లోని గ్రేట్ నెస్ బాలు చెబుతుంటే ఆ మ్యాజిక్ వేరుగా వుంటుంది. అదొక్కటే ఈ షో లో మిస్ అయ్యింది. పాటల వెనుక వున్న కబుర్లు చెప్పే మనిషే కనిపించలేదు.

దేవిశ్రీ ప్రసాద్ ఇళయరాజకి భక్తుడు. రాజా లైవ్ షో ఎక్కడున్న రెక్కలు కట్టుకొని వాలిపోవడం దేవిశ్రీకి అలవాటు. గచ్చిబౌలి స్టేడియంలో కూడా దేవిశ్రీ సందడి కనిపించిది. ప్రతి పాటకు పరవశించిపోయారు. జగడ జగడ జగడం పాటకైతే కూర్చున్న చోటే డ్యాన్స్ చేశారు. స్టేజ్ మీదకి వెళ్లి ‘’మీ పాటకి మా మనసులు, ప్రాణాలు, జీవితాలే ఊగుతున్నాయి. రాజా గారికి దేశం భాషతో పని లేదు. ఆయన మన మనసులో నిండిపోయారు’’ అని తన ఆనందం పంచుకున్నారు.

మైమరిపించిన మ్యాస్ట్రో  ఇళయరాజా లైవ్ షో

టాలీవుడ్ నుంచి నాని, హరీష్ శంకర్, బుచ్చిబాబు, మంచు లక్ష్మీ, ఇషా రెబ్బా, వర్ష బొల్లమ్మ..చాలా మంది ప్రముఖులు హజరయ్యారు.

లైవ్ షో లో కళాతపస్వి కె విశ్వనాథ్ కి అంజలి ఘటించారు ఇళయరాజా. సాగరసంగమం, స్వాతి ముత్యంలోని వేదం అణువణువున తకిట తధిమి తందాన, మౌనమేలనోయి, లాలి లాలి పాటలతో కె విశ్వనాథ్ కి నివాళి అర్పించారు.

తాజా లైవ్ షోలో ఎక్కువగా యువత కనిపించింది. స్టేడియంలోని అన్ని సెక్షన్ లు నిండిపోయాయి. షో పూర్తయ్యే వరకూ ఫుల్ క్రౌడ్ వుంది. తాము అభిమానించే పాటల స్వరకర్తని ప్రత్యేక్షంగా చూసి … ఇలాంటి పాటల రాత్రులు మళ్ళీ మళ్ళీ రావాలని మేస్ట్రో మ్యూజికల్ నైట్ ని ఎంజాయ్ చేశారు వీక్షకులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Project K: ప్రాజెక్ట్-కె పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు..! జోష్ లో...

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనే (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan) నటిస్తున్న ‘ప్రాజెక్ట్ – కె’...

Varun Tej- Lavanya Tripathi: మెగా ఇంట మోగనున్న పెళ్లి బాజాలు?

Varun Tej- Lavanya Tripathi: అందరి అనుమానమే నిజమయ్యేలా కనిపిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi)...

Tamilnadu: చనిపోయిందనుకొని కన్నతల్లికి అంతక్రియలు.. మర్నాడే ఇంట్లో ప్రత్యక్షం

Tamilnadu: తల్లి చనిపోయిందనుకుని అంత్యక్రియలు చేసాడో కొడుకు. ఆ మరుసటి రోజు ఆమె ఇంటి ఎదురుగా ప్రత్యక్షం అయింది. ఇదేదో సీనియర్ ఎన్టీఆర్ సినిమా 'యమగోల'...

Prabhas-Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమా ‘బాహుబలి’ మాదిరిగా కాదట

చిన్న సినిమాలు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రస్తుతం పవన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు మారుతి చకచక సినిమా...

Allu Aravind: నా వల్ల ఎదిగిన ఆ డైరక్టర్.. నాకే హ్యాండిచ్చాడు:...

Allu Aravind: ఇటివల సూపర్ సక్సెస్ సాధించిన 2018 సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'నా వల్ల...

రాజకీయం

YS Jagan: జగనన్నా.! జనం గేట్లు దూకి ఎందుకు పారిపోతున్నారన్నా.?

YS Jagan: పదుల సంఖ్యలో కరడుగట్టిన కార్యకర్తలు.. వందల సంఖ్యలో సాధారణ కార్యకర్తలు.. వీరికి అదనంగా, డబ్బులు ఖర్చు చేసి రప్పించుకున్న జనాలు.! ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ...

Kesineni Nani: ఎంపీ కేశినేని నాని టీడీపీలో వున్నట్టా.? లేనట్టా.?

Kesineni Nani: కేశినేని నాని.. ఒకప్పుడు కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్‌తో వార్తల్లో వ్యక్తిగా వుండేవారు. టీడీపీ ఎంపీ అయ్యాక, కేశినేని నాని పొలిటికల్ హంగామా వేరే లెవల్‌కి చేరింది. ఏ పార్టీలో...

Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి ఈజ్ బ్యాక్.! కండిషన్స్ అప్లయ్.!

Vijay Sai Reddy: ఎట్టకేలకు విజయసాయిరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా ‘రాజకీయ ప్రత్యర్థులపై’ పంచ్ డైలాగులు పేల్చడం...

జగన్ పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడు అంటున్న మాజీ సీఎం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి పోయే విధంగా అరుదైన ఘనత సొంతం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బిజెపిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. మరో...

YS Avinash Reddy: అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఓ పనైపోయింది.!

ఔను, అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఔను, ఓ పనైపోయింది.! ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు.. అంటూ మీడియాలో రచ్చ ఇకపై వుండదు.! కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద...

ఎక్కువ చదివినవి

Manchu Lakshmi : వయసు 45, డ్రెస్‌ 25.. మంచు వారి అమ్మాయి ఏంటి ఈ అరాచకం

Manchu Lakshmi : తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను నటిగా.. దర్శకురాలిగా.. నిర్మాతగా.. యాంకర్ గా అలరిస్తూనే ఉంది. 45 సంవత్సరాల...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 27 మే 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం సూర్యోదయం: ఉ.5:29 సూర్యాస్తమయం: రా.6:24 ని.లకు తిథి: జ్యేష్ఠ శుద్ధ అష్టమి పూర్తిగా సంస్కృతవారం:స్థిరవాసరః (శనివారం) నక్షత్రము:మఘ .రా.9:36 గం. వరకు తదుపరి పుబ్బ యోగం: వ్యాఘాతం రా‌.6:22...

Operation Ravan: ఆపరేషన్ రావణ్’ మూవీ ఫస్ట్ థ్రిల్ లాంచ్

Operation Ravan: ‘పలాస 1978’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో రక్షిత్ అట్లూరి కొత్త చిత్రం “ఆపరేషన్ రావణ్”. సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ న్యూ...

పెళ్లి పీటలెక్కనున్న ‘దసరా’ డైరెక్టర్

నాచురల్ స్టార్ నాని( Nani)నటించిన 'దసరా( Dasara)' చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో శ్రీకాంత్ తన స్వస్థలం కరీంనగర్...

Sarath Kumar: నన్ను సీఎం చేస్తే.. 150 ఏళ్లు బతికే సీక్రెట్ చెప్తా..

Sarath Kumar: తనను ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలకు 150 ఏళ్లు బతికి సీక్రెట్ చెప్తానని నటుడు, సమత్తువ మక్కల్ కచ్చి( SMK) అధ్యక్షుడు శరత్ కుమార్( Sarath Kumar) అన్నారు. ఆ పార్టీ...