Switch to English

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

Critic Rating
( 1.50 )
User Rating
( 1.40 )

No votes so far! Be the first to rate this post.

91,428FansLike
56,273FollowersFollow
Movie మాచర్ల నియోజకవర్గం
Star Cast నితిన్, కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా
Director ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి
Producer సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
Music మహతి స్వర సాగర్
Run Time 2 గం 40 నిమిషాలు
Release 12 ఆగస్టు 2022

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. మరి ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

కొన్ని వందల సినిమాల్లో చూసిన రొటీన్ స్టోరీనే ఎంచుకున్నాడు మన కొత్త దర్శకుడు. హీరో సిద్ధార్థ్ రెడ్డి (నితిన్) అంటే పడిచచ్చే పోయే మినిస్టర్ కూతురు (క్యాథెరిన్), కానీ హీరో ఆమెను ఇష్టపడడు. తాను కోరుకునే లక్షణాలు ఉన్న అమ్మాయి కోసం ఎదురుచూస్తుంటాడు. సరిగ్గా అప్పుడే స్వాతి (కృతి శెట్టి)ను చూసి ఇష్టపడతాడు. ఈలోగా సివిల్స్ రాసేసి టాపర్ అయిపోయి పోస్టింగ్ కోసం చూస్తుంటాడు.

సడెన్ ట్విస్ట్ లాగా స్వాతి ఉన్నపళంగా మాచెర్ల వెళ్ళిపోతుంది. మన హీరోకి కూడా కలెక్టర్ గా మాచెర్లలోనే పోస్టింగ్ పడుతుంది. అక్కడ రాజప్ప అనే ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని అరాచకాలు సృష్టిస్తూ ఉంటాడు. సరిగ్గా రాజప్పను తగులుకుని ఆ నియోజకవర్గంలో తొలిసారి ఎలెక్షన్స్ కూడా నిర్వహిస్తానని సవాల్ చేస్తాడు మన రెడ్డి. ఇక అక్కడి నుండి ఏం జరిగింది అనేది అసలు కథ.

నటీ నటుల పెర్ఫార్మన్స్:

నితిన్ ఈ సినిమాలో కొంచెం మ్యాచుర్డ్ గా కనిపించాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్ ను చేసాడు. తనవరకూ 100 శాతం ఎఫర్ట్ పెట్టాడు. అయితే భారీ డైలాగులు చెప్పే చోట్ల అంతగా సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఏదేమైనా నితిన్ ఈ సినిమాలో తనవరకూ ఇంప్రెస్ చేస్తాడు.

ఇక హీరోయిన్లుగా చేసిన కృతి శెట్టి, క్యాథెరిన్ లకు పెద్దగా స్కోప్ లేదు. స్టోరీతో కృతికి కొంతైనా లింక్ ఉంది. ఆమె పర్వాలేదు. చూడటానికి బాగుంది. క్యాథెరిన్ కేవలం ఫస్ట్ హాఫ్ కే పరిమితమైంది.

విలన్ గా సముద్రఖని తనకు అలవాటైన రీతిలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తను కూడా ఇంప్రెస్ చేస్తాడు. ఇగో నిండిపోయిన వ్యక్తిగా వెన్నెల కిషోర్ కామెడీ బాగానే ఉంది.

ఇక బ్రహ్మాజీ, శ్యామల తదితరులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణులు:

మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. పాటలు పెద్దగా ఇంప్రెస్ చేయవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా ఆకట్టుకుంటాడు. అయితే కొన్ని చోట్ల మరీ లౌడ్ అయిపోయింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ప్రసాద్ మురెళ్ళ మాస్ కమర్షియల్ సినిమాకు తగ్గట్లుగా తన ఔట్పుట్ అందించాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఎడిటర్ గా కావాల్సినంత అనుభవం ఉన్న రాజశేఖర్ రెడ్డి, కథ విషయంలో పూర్తిగా తడబడ్డాడు. మరీ రొటీన్ కథను ఎత్తుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా ఉంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఒక్కటంటే ఒక్క సీన్ కూడా కమర్షియల్ గా హై ఇవ్వదు. అలాగే ఫ్రెష్ నెస్ కూడా లేదు.

పాజిటివ్ పాయింట్స్:

  • వెన్నెల కిషోర్
  • పాటలు

నెగటివ్ పాయింట్స్:

  • యాక్షన్ సన్నివేశాలు
  • రొటీన్ స్క్రీన్ ప్లే
  • కథ లేకపోవడం
  • రన్ టైమ్

విశ్లేషణ:

మొదటి సీన్ నుండీ ఏ మాత్రం ఫ్రెష్ నెస్ లేకుండా కొన్ని వందల సినిమాల్లో చూసిన సన్నివేశాలు ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సాంకేతికంగా అన్ని అంశాల్లో ఫెయిల్ అయిన మాచెర్లను భరించడం కష్టమే.

తెలుగు బులెటిన్ రేటింగ్: 1.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రైవేట్‌ హాస్పటిల్స్ కి పండగే

పెళ్లి కాలేదు అన్న కారణంతో అమ్మాయిలకు ఇన్నాళ్లు అధికారికంగా ఆసుపత్రి లు అబార్షన్స్ చేయడం లేదు. ఒకవేళ పెళ్లి కానీ అమ్మాయిలకు అబార్షన్ చేస్తే సదరు హాస్పిటల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు....

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ఒరిస్సా కు చెందిన కృష్ణ...

రాశి ఫలాలు: ఆదివారం 02 అక్టోబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:54 సూర్యాస్తమయం: సా.5:51 తిథి: ఆశ్వయుజ శుద్ధ సప్తమి రా.6:25 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ అష్టమి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము:మూల రా.2:30 వరకు తదుపరి...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

బిగ్‌బాస్‌ పై ఏపీ హైకోర్ట్‌ లో పిటీషన్‌.. షాక్ తప్పదా!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. ఆట ఆసక్తికరంగా మారుతున్న ఈ సమయంలో బిగ్బాస్ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. శృతిమించిన శృంగార...