Switch to English

‘మా’ గొడవ: ‘మెగా’ బ్లండర్ సరిదిద్దేదెలా.?

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ఓ శిఖరం. అలాంటి శిఖరాన్ని చూసి మొరిగే సినీ జంతువులకు లోటేముంటుంది.? కులం పేరుతోనో, రాజకీయం పేరుతోనో చిరంజీవిని రోడ్డు మీదకు లాగేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాయి కొన్ని సినీ, రాజకీయ గ్రామ సింహాలు.

‘మా’ ఎన్నికల వేళ అసందర్భ ప్రేలాపనలు చాలా కనిపించాయి. వినిపించాయి చిరంజీవి మీద. ఎక్కడా చిరంజీవి, ఎవ్వరికీ ప్రత్యేకంగా మద్దతు ప్రకటించింది లేదు. ప్రకాష్ రాజ్‌కి చిరంజీవి ఆశీస్సులున్నాయి.. అని నాగబాబు చెబితే, దానర్ధం నేరుగా ప్రకాష్ రాజ్‌కి చిరంజీవి పూర్తి మద్దతిచ్చినట్లు కాదు.

చిరంజీవి అంకుల్ మా కుటుంబ సభ్యుడే. ఆయన నాకే మద్దతిస్తారంటూ.. విష్ణు చెప్పిన విషయాన్ని ఇక్కడ పరిగణలోనికి తీసుకోవాలి. అంటే చిరంజీవి అటు ప్రకాష్ రాజ్, ఇటు విష్ణు ఇద్దరినీ సమానంగానే చూశారన్న మాట. కల్మషం లేని వ్యక్తి చిరంజీవి. సినీ పరిశ్రమలో ఎవర్ని అడిగినా ఇదే మాట చెబుతారు.

కానీ, రెండేళ్ల పాటు ఉండే ఓ పదవి కోసం ఎలాంటి అధికారాలు, హోదా లేని పదవుల కోసం చిరంజీవి పేరును బదనాం చేస్తూ సినీ రాజకీయం చేశారు కొందరు. తద్వారా సినీ పరిశ్రమలో అలజడికి కారణమయ్యారు. వాస్తవానికి ఏకగ్రీవం దిశగా చిరంజీవి ఆలోచనలు సాగాయి. ఏకగ్రీవమైతే పరిశ్రమలో గొడవలుండవనేది చిరంజీవి ఆలోచన.

కానీ, ఆ ఆలోచనకి మంచి దారి దొరకలేదు. ఎందుకంటే, అసాంఘిక శక్తులు ‘మా’ ఎన్నికలను అంత చండాలంగా మార్చేశాయి. అంతా అయిపోయాకా, జరగరాని దారుణాలు జరిగిపోయాకా, డ్యామేజీ కంట్రోల్ చర్యలు మొదలెట్టారు. కులామతల్లి వారసులం కాదు, కళామతల్లి వారసులం.. అని కాస్త లేటుగా తెలుసుకున్నారు కొందరు.

ఎలా.? వారికి జ్ఞానోదయం అయ్యిందో కానీ, ఇప్పుడు చిరంజీవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పయిపోయింది మహాప్రభో.. అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు. ముందే చెప్పుకున్నాం కదా.. చిరంజీవి అంటే ‘మహా శిఖరం’ అని.

చిరంజీవికి సంబంధం లేని సినీ రాజకీయంలో, చిరంజీవి పేరును బదనాం చేసి, పైశాచికానందం పొందాలనుకున్నవాళ్లకి చాలా తక్కువ సమయంలోనే మైండ్ బ్లాంక్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు దారి తప్పిన సినీ రాజకీయాన్ని చిరంజీవే సరిదిద్దాల్సి రావడం ఆశ్చర్యకరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

వచ్చే రెండేళ్లూ విష్ణుని నిద్రపోనివ్వను: ప్రకాశ్ రాజ్

‘మా’ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే నేను ఎన్నికల్లో...

రష్మిక నె.1, రౌడీస్టార్ నెం.1

సెలబ్రెటీలు అంటేనే ప్రభావితం చేసే వారు అనడంలో సందేహం లేదు. వారి మాటలు లేదా వారి ప్రవర్తన ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే వారితో...

అఖిల్ సక్సెస్ లో అల్లు అర్జున్ భాగం!

అఖిల్ అక్కినేని ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న తొలి విజయం మొత్తానికి వచ్చేసింది. అఖిల్ మొదటి మూడు చిత్రాలు ప్లాప్ అవ్వడంతో నాలుగో సినిమా విజయం సాధించడానికి డెస్పెరేట్...

దీపావళికి ఆర్ ఆర్ ఆర్ మెరుపులు

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నుండి బాహుబలి తర్వాత వస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఐదు భాషల్లో విడుదలవుతోన్న ఆర్...

రాజకీయం

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

కారుణ్య నియామకాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని...

జనసేనానిపై ‘బులుగు-పచ్చ’ కుట్ర: ఆర్కే మార్కు పైత్యం.!

అధికార పీఠంపై రెండే రెండు సామాజిక వర్గాలకు అవకాశం వుండాలి. ఇంకెవరూ అటువైపు కన్నెత్తి చూడకూడదు. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యాలి.. నామినేటెడ్ పదవుల పేరుతో ఇతర సామాజిక...

టీడీపీలో కీలక చేరిక

ఏపీలో తెలుగు దేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ముఖ్య నాయకులు పలువురు పార్టీని వదిలేశారు. ఇప్పుడు మరి కొందరు ముఖ్య నాయకులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి...

ఎక్కువ చదివినవి

మంచు విష్ణును పట్టించుకోని పవన్‌ కళ్యాణ్‌

మా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన మంచు విష్ణు ఆ తర్వాత మెగా కాంపౌండ్ గురించి కాస్త సీరియస్ గా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మోహన్ బాబు కూడా మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ...

సీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీలో పోరాడతాం: ఎమ్మెల్యే బాలకృష్ణ

సీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాడతామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్‌పై  ఆ ప్రాంత టీడీపీ నేతలు నిర్వహించిన సదస్సులో ఆయన...

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలపై మంచు విష్ణు వ్యాఖ్యలు..!!

ఇటివలి మా ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా అసోసియేషన్ అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని ఆయన...

సీఎం భార్యను కూడా తాకట్టు పెడతాడేమో

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంను నడిపించేందుకు సీఎం జగన్ చాలా అప్పులు చేస్తున్నాడు. అందుకోసం పెద్ద ఎత్తున బాండ్స్ ను తాకట్టు...

రాశి ఫలాలు: ఆదివారం 17 అక్టోబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం సూర్యోదయం: ఉ.5:57 సూర్యాస్తమయం: సా‌.5:37 తిథి: ఆశ్వీయుజ ద్వాదశి రా.6:26 వరకు తదుపరి త్రయోదశి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము: శతభిషం ఉ.11:50 వరకు తదుపరి పూర్వాభాద్ర యోగం: వృద్ధి...