Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు. సినిమా నుంచి ‘మాస్ జాతర’ లిరికల్ సాంగ్ రిలీజ్. శ్రీచక్రాస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లో చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాతగా దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్, యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ‘మాస్ జాతర’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
‘ఆడు ఆడు ఆడు ఆడు నిలువెల్లా పూనకమై ఆడు..ఆడు ఆడు ఆడు ఆడు ఆడు అమ్మోరే మురిసేలా ఆడు.. ఆడు ఆడు ఆడు ఆడు ఊరు వాడ అదిరేలా ఆడు..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. సామ్ సీఎస్ సంగీతం అందించిన పాటకు సనాపాటి భరద్వాజ పాత్రుడు సాహిత్యం అందించారు. కథానుసారం వచ్చే జాతర పాట ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తుందని మేకర్స్ అంటున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో సినిమా విడుదల కాబోతోంది. మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ సినిమా రిలీజ్ చేయబోతున్నారు.