Switch to English

జగన్ ముందు భారీ సవాళ్లు.. ఎదుర్కొంటాడా? చేతులెత్తేస్తాడా?

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చామన్న ఆనందం కంటే అడుగడుగునా ఎదురౌతున్న సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అనే బాధ ఎక్కువైంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ఎన్నికల మ్యానిఫెస్టో లో పెట్టిన నవరత్నాలు హామీలను నెరవేర్చేందుకు అన్ని రకాలుగా జగన్ సిద్ధం అయ్యి దానికి తగిన ఏర్పాట్లు చేసుకొని అమలు చేస్తున్నాడు.

ప్రజల ముఖ్యమంత్రిగా అనిపించుకోవడానికి జగన్ చేసిన ప్రయత్నం అంతాఇంతా కాదు. ఆరు నెలల్లోనే జగన్ ప్రజల ముఖ్యమంత్రిగా మెప్పు పొందాడు. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. అప్పటి వరకు రాజధాని విషయంలో సైలెంట్ గా ఉన్న జగన్, మూడు రాజధానుల అంశం తెరమీదకు తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో రాజధాని రగడ మొదలైంది. రాజధాని ప్రాంతంలోని రైతులు గొడవలు, ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. ఆ గొడవలు ఎలాగోలా సద్దుమణుగుతున్నాయి… రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బలం నిరూపించుకుంటే మూడు రాజధానులు ప్రజలు మద్దతు ఇస్తున్నారు అనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు అనే లోగా కరోనా మహమ్మారి వచ్చిపడింది.

కరోనా రాష్ట్రంలో పెద్దగా లేదు కాబట్టి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. కానీ, సుప్రీం కోర్టు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ తరువాతే కథ మొత్తం మారిపోయింది. మార్చి 22 వ తేదీన జనతా కర్ఫ్యూ విధించడం, ఆ తరువాత రాష్ట్రాలు లాక్ డౌన్ చేయడం, ఇండియాను 21 రోజులపాటు లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడంతో జగన్ ప్రభుత్వం వేసుకున్న ప్లాన్స్ అన్ని రివర్స్ అయ్యాయి. బడ్జెట్ సమావేశాలు లేకుండానే మూడు నెలల కోసం ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ ద్వారా దానిని ఆమోదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రస్తతం రాష్ట్రంలో కరోనా ప్రభావం మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే పెద్దగా లేదని చెప్పాలి. తెలంగాణలో 59 కేసులుంటే, ఆంధ్రప్రదేశ్ లో 13 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మార్చి మొదటివారం నుంచి ఆంధ్రప్రదేశ్ కు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల సంఖ్య 20 వేలకు పైగా ఉన్నది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారానే ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో వైరస్ ను జగన్ ప్రభుత్వం ఎలా కట్టడి చేస్తుంది అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉన్నది. ఇప్పటి వరకైతే కంట్రోల్ లోనే ఉన్నది. ఇకపై కూడా అలానే ఉంటుందా? జగన్ ప్రభుత్వం కరోనాపై యుద్ధం చేసి గెలుస్తుందా? చూద్దాం.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

తనపై వస్తున్న విమర్శలకు నాగబాబు కౌంటర్

మెగా బ్రదర్ నాగబాబు రెండు రోజుల క్రితం నాధూరామ్ గాడ్సేను నిజమైన దేశభక్తుడు అంటూ ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా...

గుడ్ న్యూస్: జూన్ నుంచి షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్.!

నిన్ననే(మే 21న) సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులంతా కలిసి సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, అలాగే థియేటర్స్ పరిస్థితిపై...

బిగ్ బాస్ స్టార్ తండ్రి ఒక రేపిస్ట్

హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించింది నటి, సింగర్, మోడల్ షెహనాజ్ గిల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ దక్కించుకున్న షెహనాజ్...

జమ్మూలో ఉగ్రమూక ఎన్‌కౌంటర్‌

ప్రపంచం మొత్తం కూడా కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మిర్‌లో ఉగ్రవాదులు భారత జవాన్‌లపై విరుచుకు పడటంతో పాటు చంపేందుకు...

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది...