ఏపీకి పరిశ్రమలు తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. విద్యా, ఐటీ శాఖల మంత్రిగా ఉన్న ఆయన.. గతంలో ఐటీ మంత్రిగా చేసిన అనుభవంతో ఇప్పుడు మళ్లీ అదే బాటలో పయనిస్తున్నారు. గతంలో కంటే మెరుగ్గా ఈ సారి ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ఆయన పని చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ పరిశ్రమలను తెచ్చే పనిలో నిమగ్నం అయ్యారు.
యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ లీడర్ షిప్ ఫోరం సమ్మిట్ లో పాల్గొన్న ఆయన.. చాలా విషయాలన పంచుకున్నారు. ఆపిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అయిన విరాట్ భాటియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. పరిశ్రమలకు త్వరగా అనుమతులు ఇచ్చేందుకు అన్ని రకాల పాలసీలు తెస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ద్వారా పర్మిషన్లకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తున్నామన్నారు. ఇందుకోసం ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును పునరుద్దరించినట్టు వివరించారు.
అంతే కాకుండా ప్రైవేట్ సెక్టార్ ప్రముఖులతో సలహా మండలిని వేసినట్టు వివరించారు. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంట్రాక్టు ద్వారా పర్మిషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు నారా లోకేష్. ఇప్పటి వరకు చేసినవి వేరే అని.. ఇక నుంచి ప్రత్యేక పాలసీల ద్వారా పరిశ్రమలకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.