Switch to English

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు హాజరై తమ సమస్యలను నేరుగా మంత్రికి తెలియజేశారు. వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వినతులను స్వీకరించారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన పత్తి శివకుమార్ తమకు వారసత్వంగా వచ్చిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని, దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. తిరుమలలో అంగప్రదక్షణ భక్తులకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, ఆఫ్‌లైన్ ద్వారా టోకెన్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ‘తిరుమల అంగప్రదక్షణ భక్తబృందం’ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కచ్చరావేడు గ్రామంలో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని బి. శ్రీనివాసులు కోరారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో జీవనోపాధి కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న 150 ఎస్టీ ఎరుకుల కుటుంబాలకు ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని శ్రీ వేంకటేశ్వర ఎస్టీ ఎరుకల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో సొసైటీ విధానంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీసర్లకు ఇతర ఉద్యోగుల మాదిరిగానే వైద్య సదుపాయం, శ్రీవారి దర్శనం కల్పించాలని సిబ్బంది కోరారు.

గత వైసీపీ ప్రభుత్వ కాలంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో తొలగింపునకు గురైన 160 మంది కాంట్రాక్ట్, పార్ట్‌టైం సూపర్‌వైజర్లకు తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కాంట్రాక్ట్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. అలాగే అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బలిజపల్లికి చెందిన కె. పార్వతి తమకు వారసత్వంగా వచ్చిన రెండెకరాల భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి హక్కులు కల్పించాలని కోరారు.

అన్ని వినతులను శ్రద్ధగా విన్న మంత్రి నారా లోకేష్, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్ అనంతరం హాజరైన ప్రజలు, కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు.

సినిమా

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

రాజకీయం

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

ఎక్కువ చదివినవి

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

Daily Horoscope: వృశ్చికంలో ఆర్థిక లాభాలు, మకరంలో ఉద్యోగావకాశాలు

ఫిబ్రవరి 15, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో వేగం పెరుగుతుంది. చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితం ఇస్తుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వార్త వింటారు. ఖర్చులు...

కపుల్ ఫ్రెండ్లీ’పై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసల పోస్ట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సోషల్ మీడియాలో ప్రశంసలతో కూడిన...

నన్నయ్య యూనివర్సిటీపై ఆరోపణలు.. అనుమతుల అక్రమాలపై లోకేష్ హెచ్చరిక

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో కళాశాలల అనుమతుల విషయంలో అవకతవకలకు సంబంధించి ఆధారాలు పంపితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు....

చిరంజీవి చేతికి బ్యాండ్ ఎందుకు? అభిమానుల్లో టెన్షన్

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బయటకు వచ్చిన ఫోటోలలో చేతికి బ్యాండ్‌తో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అల్లు శిరీష్ వివాహానికి సంబంధించిన శుభలేఖ అందుకునే సమయంలో తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్...