అనకాపల్లిలో రూ.2,300 కోట్ల బ్లూ జెట్ ప్లాంట్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మరో భారీ ఔషధ తయారీ పరిశ్రమకు నాంది పడింది. అచ్యుతాపురం–రాంబిల్లి మండలాల పరిధిలోని సీతపాలెం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనిట్‌కు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్  శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

సీతపాలెం ఇండస్ట్రియల్ పార్క్‌కు చేరుకున్న మంత్రి లోకేష్‌కు కంపెనీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్‌కు భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియేట్స్ మరియు కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.2,300 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది.

ఈ యూనిట్ ఏర్పాటుతో సుమారు 1,750 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యేక ఔషధ మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో గుర్తింపు పొందిన బ్లూ జెట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 102.48 ఎకరాల భూమిని కేటాయించింది. పరిశ్రమ స్థాపనతో అనకాపల్లి జిల్లా పరిశ్రమల రంగంలో మరింత వేగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, బీయలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఏపీఆర్డీసీ ఛైర్మన్ పి. నాగేశ్వరరావు, బ్లూ జెట్ హెల్త్‌కేర్ సంస్థ ఛైర్మన్ అక్షయ్ బన్సారీలాల్ అరోరా, మేనేజింగ్ డైరెక్టర్ శివెన్ అరోరా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేణుబాబు, సహ వ్యవస్థాపకులు నరేష్ షా, కలెక్టర్ విజయ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీఐఐసీ మరియు వివిధ శాఖల అధికారులు, కంపెనీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు.

అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, అచ్యుతాపురం SEZలో బ్లూ జెట్ హెల్త్ కేర్ పెట్టుబడి రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి మరో పెద్ద ముందడుగుగా నిలవనుంది.

సినిమా

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

అడివి శేష్ కొత్త గేమ్ ప్లాన్.. రెండు ప్రాజెక్ట్స్‌తో సర్‌ప్రైజ్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక కథల ఎంపికతో గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ (Adivi Sesh), మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, శేష్ రెండు...

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

కాకినాడలో ఒక్క గుంత కూడా కనిపించకూడదు.. ప్రతి రెండు నెలలకు వస్తా: పవన్ కళ్యాణ్

కాకినాడ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి కాకినాడ జిల్లా, ముఖ్యంగా కాకినాడ మరియు పిఠాపురం...

“‘The Paradise’లో విలన్‌గా మోహన్ బాబు… రూ.7 కోట్ల పారితోషికం హాట్ టాపిక్!”

టాలీవుడ్‌లో భారీ చర్చకు దారితీస్తున్న అప్డేట్ ఇది. హీరో నాని నటిస్తున్న ‘The Paradise’ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రధాన విలన్‌గా నటిస్తున్న విషయం  తెలిసిందే.  అయితే ఇప్పుడు  మరింత...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...