Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్, లియో వంటి యాక్షన్, థ్రిల్లర్ సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఆయన్నుంచి అలాంటి సినిమాలే ఆశించే ప్రేక్షకులకు రీసెంట్ ఇంటర్వ్యూలో షాకింగ్ న్యూస్ రివీల్ చేశారు. మీరు రొమాంటిక్ మూవీస్ ఇష్టపడతారా..? అనే ప్రశ్నకు సరదా సమాధానం ఇచ్చారు.
‘నేను రొమాంటిక్ మూవీస్ చూస్తాను. ఇష్టం కూడా. అందుకే ఓ సినిమా తీయాలని కోవిడ్ సమయంలో ఓ లవ్ స్టోరీ రాశాను. పూర్తయ్యాక మా ఎడిటర్ కు కథ వివరించాను. కథ విన్న ఆయన.. నువ్వు రాసిన కథలన్నింటిల్లోకీ ఇదే మోస్ట్ వయలెంట్ మూవీ అన్నాడు. దీంతో ఆ కథ పక్కన పెట్టేశా (నవ్వుతూ)’.
‘ప్రస్తుతం నేను ఎల్ సీయూ సిరీస్ లో యాక్షన్ సినిమాలే తీస్తాను. విజయ్ రాజకీయాల్లోకి రాకపోయుంటే లియో-2 తీసేవాడిన’ని అన్నారు. ఆ ప్రేమ కథతో సినిమా తీయండి సర్.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లోకేశ్ ప్రస్తుతం రజినీకాంత్ లో కూలీ తీస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.