ప్రేమికుల దినోత్సవం రోజు అన్నమయ్య జిల్లాలో ఊహించని సంఘటన జరిగింది. జిల్లాలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన గౌతమి పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనపై మంత్రి లోకేష్ చాలా సీరియస్ గా స్పందించారు. సోదరికి మెరుగైన వైద్యం అందించి అండగా నిలుస్తామని అన్నారు.
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన గౌతమి మీద యాసిడ్ దాడి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ యాసిడ్ బాధితురాలు తండ్రి జనార్ధన్ తో మాట్లాడారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అత్యంత మెరుగైన వైద్యం అందేలా చూస్తామని చెప్పారు లోకేష్.
ఆమెను సొంత చెల్లిగా భావించి అండగా ఉంటామని లోకేష్ అన్నారు. ఈ యాసిడ్ దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్ ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసిందని అన్నారు. దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తామని.. అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు లోకేష్. బాధిత కుటుంబానికి ధైర్యం చెబుతూ మీ వెంట నేనుంటానని లోకేష్ భరోసా ఇచ్చారు.
యాసిడ్ బాధితురాలు గౌతమి కోలుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి మండుపల్లి రాంప్రసాద్ కు చెప్పారు లోకేష్. ఆమె వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా పర్యవేక్షించాలని రాంప్రసాద్ కు సూచించారు లోకేష్.
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఆ సోదరికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తాం. గౌతమిపై అత్యంత అమానవీయంగా వ్యవహరించిన సైకోని కఠినంగా శిక్షిస్తాం. భవిష్యత్ లో మరో చెల్లిపై ఇటువంటి ఘటనలు…
— Lokesh Nara (@naralokesh) February 14, 2025