Switch to English

విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,195FansLike
57,764FollowersFollow

విశాఖపట్నంలో అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఫిన్‌టెక్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేదమంత్రాల మధ్య రిబ్బన్ కట్ చేసి, జ్యోతిప్రజ్వలన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మధురవాడ హిల్ నెం–2లోని మహతి ఫిన్‌టెక్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్‌లో వెయ్యి మందికి సీటింగ్ సౌకర్యం కల్పించారు. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ మొదటి దశ పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగనున్నాయి. AI, ML, క్లౌడ్ సొల్యూషన్స్, డిజిటల్ ఇంజినీరింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలపై ఈ సెంటర్ దృష్టి పెట్టనుంది.

తరువాత ఉద్యోగులతో మాట్లాడిన మంత్రి లోకేష్, “ఆంధ్రప్రదేశ్‌ గర్వించేట్టు పనిచేయాలి. యువతే భవిష్యత్తుకు మార్గదర్శకులు. కృషితో విజయాలు సాధించాలి” అని సూచించారు. గతేడాది జనవరిలో కాగ్నిజెంట్ అధినేత రవికుమార్‌ను కలిసిన తర్వాత ఏడాదిలోనే సంస్థను రాష్ట్రానికి తీసుకురావడం సంతోషకరమని తెలిపారు. విశాఖను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో ఎస్. రవికుమార్, గుమ్మడి సూర్య, తిరుమల నారాయణన్, గౌరవ్ హజ్రా, ఎంపీ భరత్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సినిమా

మెగా బ్లాక్ బస్టర్ పై స్పందించిన .. అల్లు(డు) అర్జున్

మెగాస్టార్ చిరంజీవి – అల్లు అర్జున్ మధ్య సంబంధాలపై సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది. ఒకవైపు మెగా కుటుంబం నుంచి దూరంగా...

90 రోజుల ముందే టికెట్ ధరల ఉత్తర్వులు ఇవ్వాలి: హైకోర్టు సంచలన...

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు జారీ...

గౌతమ్ ఎంట్రీకి డైరెక్టర్ ఎవరు?

సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని సినీ ఎంట్రీపై టాలీవుడ్‌లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో ప్రొఫెషనల్ యాక్టింగ్ కోర్స్ పూర్తి...

ప్రెస్ క్లబ్‌లో రేణూ దేశాయ్–రష్మీ గౌతమ్ స్పీచ్… కుక్కల హింసపై ఆవేదన,...

హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ తీవ్ర చర్చకు దారి తీసింది. నటి రేణూ దేశాయ్, యాంకర్ రష్మీ గౌతమ్ పాల్గొన్న ఈ...

CHIRANJEEVI: ముంగిట్లో సంక్రాంతి ముగిసింది.. ధియేటర్లో ‘చిరంజీవి’ పండగ ముగియలేదు

CHIRANJEEVI: సంక్రాంతి పండగొచ్చింది.. ప్రజలను ఊళ్ళకు రప్పించింది.. కుటుంబాల్లో ఆనందాలు నింపింది.. సంబరాలు చేసింది..! వారం రోజుల సంతోషాలు, ఆనందాలు పండగ వెళ్ళిపోవడంతో పండగ సంతోషాలు...

రాజకీయం

వైసీపీ వర్సెస్ టీడీపీ: దిష్టి బొమ్మ ఎవరు.?

మాజీ మంత్రి అమర్‌నాథ్‌కి సోషల్ మీడియాలో వున్న పేరు ‘కోడి గుడ్డు అమర్నాథ్’ అని. ఆ పేరు ఆయనకి ఎలా వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాభివృద్ధి విషయమై మీడియా అడిగిన...

కల్చర్‌ బట్టల వరకే పరిమితమైందా? కుక్కల అంశంపై రష్మి గౌతమ్‌ గట్టి ప్రశ్నలు

యాంకర్‌ రష్మి గౌతమ్‌ తాజాగా కుక్కల సమస్యపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆమె, సమాజంలో మనుషుల ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా...

దావోస్‌లో ఏపీకి గ్రీన్ టెక్ బూస్ట్… పోర్టుల్లో హైడ్రోజన్ వాహనాలపై కీలక చర్చలు

దావోస్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక భేటీ నిర్వహించారు. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ సంస్థ ఎవల్యూషన్ సినర్జెటిక్ ఆటోమోటివ్ ఎస్‌ఎల్ (EVO) మేనేజింగ్...

“అభివృద్ధి అంటే చంద్రబాబు”: యూరప్ వేదికపై లోకేష్ స్పష్టమైన సందేశం

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ వేదికగా జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేనని స్పష్టం చేస్తూ, ఆయన...

కోటరీ కుంపటి.! వైసీపీకి విసారెడ్డి ఉచిత సలహా ఉపయోగపడేనా.?

వెనిజులా అంశాన్ని తీసుకొచ్చి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉచిత సలహా ఇచ్చారు వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి. దాంతో, సహజంగానే వైసీపీలో కొంతమందికి బాగా కాలింది. ఆ...

ఎక్కువ చదివినవి

కోటరీ కుంపటి.! వైసీపీకి విసారెడ్డి ఉచిత సలహా ఉపయోగపడేనా.?

వెనిజులా అంశాన్ని తీసుకొచ్చి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉచిత సలహా ఇచ్చారు వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి. దాంతో, సహజంగానే వైసీపీలో కొంతమందికి బాగా కాలింది. ఆ...

సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’

సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.190...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

టీడీపీని ముంచింది TRS – సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పతనానికి కాంగ్రెస్ కారణం కాదని, అప్పటి TRS పార్టీ మరియు కేసీఆర్ రాజకీయాలే కారణమని స్పష్టంగా చెప్పారు.  టిడిపి ని  ముంచింది...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...