7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శాసనమండలిలో సభ్యురాలు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ ఈ వివరాలు వెల్లడించారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో 7వ తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న బాలికలకు ప్రతినెలా ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో విద్యార్థినులకు ఏడు రెగ్యులర్ సైజ్, మూడు లార్జ్ సైజ్ న్యాప్‌కిన్‌లు అందించేవారని, అయితే బాలికల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ఐదు రెగ్యులర్ సైజ్, ఐదు లార్జ్ సైజ్ శానిటరీ ప్యాడ్‌లను ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు.

గత ప్రభుత్వ కాలంలో ఈ పథకానికి సంబంధించి రూ.18.96 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రజా ప్రభుత్వం వాటిని పూర్తిగా చెల్లించిందని మంత్రి తెలిపారు. శానిటరీ న్యాప్‌కిన్‌ల సరఫరా, నాణ్యతపై నిరంతరం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని కూడా చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి విద్యార్థినుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు.

ఫీడ్‌బ్యాక్ ప్రకారం 96 శాతం బాలికలు తమకు శానిటరీ న్యాప్‌కిన్‌లు అందుతున్నాయని, నాలుగు శాతం మంది అందడం లేదని పేర్కొన్నారని మంత్రి తెలిపారు. నాణ్యత విషయంలో ఒక శాతం మంది బాగోలేదని, 14 శాతం మంది పర్వాలేదని, 85 శాతం మంది బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. అలాగే శానిటరీ న్యాప్‌కిన్‌ల అబ్సార్ప్షన్ విషయంలో 84 శాతం మంది బాగుందని, 14 శాతం మంది పర్వాలేదని, రెండు శాతం మంది బాగోలేదని తెలిపారు. సైజ్ విషయంలో 89 శాతం మంది బాగుందని, 11 శాతం మంది సంతృప్తిగా లేరని ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని పేర్కొన్నారు.

ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్‌ల పంపిణీపై కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతోందని మంత్రి తెలిపారు. దీనిపై పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాలికల్లో ఆరోగ్య అవగాహన పెంచేందుకు ఎన్జీవోలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. అలాగే స్మార్ట్ కార్డ్‌తో పనిచేసే వెండింగ్ మిషన్‌లను ఇప్పటికే కేజీబీవీల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించామని, భవిష్యత్తులో అన్ని పాఠశాలలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాక్సిన్‌ను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారని పేర్కొంటూ, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు క్యాంపెయిన్ తరహాలో ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. బాలికల ఆరోగ్య రక్షణకు ఈ వ్యాక్సిన్ ఎంతో అవసరమని, అందరూ కలిసి దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఇక సభ్యురాలు కావలి గ్రీష్మ మాట్లాడుతూ నెలసరి సమయంలో సరైన హైజీన్ ఉత్పత్తులు అందక చాలా మంది విద్యార్థినులు పాఠశాలలకు గైర్హాజరవుతున్నారని తెలిపారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ, ప్రభుత్వ పాఠశాలలు మరియు కాలేజీల్లో చదువుతున్న బాలికలకు ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్‌లు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సినిమా

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది....

Vishnu Priya: చిక్కుల్లో నటి విష్ణుప్రియ..! ఆమెపై క్రిమినల్ కేసు నమోదుకు...

Vishnu Priya: సినీ నటి, బుల్లితెర యాంకర్ విష్ణుప్రియపై పోలిస్ కేసు నమోదయింది. ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఆమె చేస్తున్న పబ్లిసిటీ యువతను పెడదోవ పట్టించేలా...

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా,...

Daily Horoscope: సింహకు గౌరవం పెరుగుతుంది.. మీనకు శుభవార్తలు అందుతాయి

ఏప్రిల్ 10 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్య, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల్లో మార్గదర్శకంగా...

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

Akira Nandan: అకీరా ఎంట్రీకి టైమ్ వచ్చిందా?

Akira Nandan: మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పేరు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది — అకీరా నందన్. పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్,...

“‘The Paradise’లో విలన్‌గా మోహన్ బాబు… రూ.7 కోట్ల పారితోషికం హాట్ టాపిక్!”

టాలీవుడ్‌లో భారీ చర్చకు దారితీస్తున్న అప్డేట్ ఇది. హీరో నాని నటిస్తున్న ‘The Paradise’ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రధాన విలన్‌గా నటిస్తున్న విషయం  తెలిసిందే.  అయితే ఇప్పుడు  మరింత...