కూటమి విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి.. టీడీపీ కేడర్‌కు లోకేష్ పిలుపు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,223FansLike
57,764FollowersFollow

అమరావతి: గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజలకు చేరవేయడం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధ్యత అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించాలని ఆయన పార్టీ నాయకత్వానికి పిలుపునిచ్చారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో లోకేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఇంటికి చేరుకుని ప్రభుత్వం చేసిన పనులను వివరించే కరపత్రాలు, బుక్‌లెట్లు పంపిణీ చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులను కూడా భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని లోకేష్ సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ప్రతీకగా నిలిచారని, అదే సమయంలో సంక్షేమ రంగంలోనూ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. తల్లికి వందనం, దీపం-2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, రూ.4 వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్, ఆటో డ్రైవర్ల సేవలో పథకం, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు చేరవేయడంలో విఫలమైతే వాటి ప్రభావం తగ్గిపోతుందని లోకేష్ వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2019 మధ్య చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం, ప్రత్యర్థుల ప్రచారం ప్రభావం వల్లే గతంలో రాజకీయంగా నష్టం జరిగిందని గుర్తు చేశారు.

ఈనెల 20వ తేదీ వరకు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో విజయోత్సవ సభలు నిర్వహించాలని, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

ఓటర్ల జాబితా పరిశీలనలో ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని, బూత్ స్థాయి ఏజెంట్లు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని లోకేష్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అవసరమైతే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ వెరిఫికేషన్ సెల్‌ను సంప్రదించాలని సూచించారు.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. మూడు రోజుల్లో నాలుగు సార్లు అదుపులోకి

యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రతి కేసులో...

అల్లూరి ఆశయాలే దేశానికి స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశంలో అల్లూరి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: చిరంజీవిపై చెడు ప్రచారం..! విమర్శకులకు వి.ఎన్.ఆదిత్య క్లాస్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని యాంటీ ఫ్యానిజంతో పదేపదే తూలనాడతారు కొందరు యాంటీ ఫ్యాన్స్. నీకు నచ్చిన హీరోని అభిమానించుకునే క్రమంలో చిరంజీవిని దూషించడం అవివేకం. పరిస్థితుల ప్రభావంతో హీరో ఉదయ్ కిరణ్ ఈలోకం...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

సింగపూర్‌తో ఏపీ భాగస్వామ్యం బలోపేతం.. మంత్రి లోకేష్ కీలక భేటీ

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్‌తో ఉండవల్లిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్–సింగపూర్ మధ్య పెట్టుబడులు, సాంకేతికత,...

Daily Horoscope: సింహ రాశికి ఆర్థిక లాభం.. మీన రాశికి శుభవార్త

జులై 4, 2026 శనివారం రాశిఫలాలు: ఈ రోజు చంద్ర మాన పంచాంగం ఆధారంగా గ్రహస్థితులను పరిశీలించి సిద్ధం చేసిన రాశి ఫలాలు ఇవి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం, ఆరోగ్యం,...

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ.6.3 కోట్లతో అభివృద్ధి పనులు.. లోకేష్ శంకుస్థాపన

మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.6.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు...