Switch to English

ఇకపై ఇళ్లలో కాదు.. అప్రమత్తంగా ఉండాలి

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా కారణంగా మొత్తం జనజీవనం స్తంభించింది. పలు దేశాలు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ విధించాయి. కానీ రోజులు గడుస్తున్నా.. కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. అలా అని లాక్ డౌన్ ఎత్తేస్తే మొదటికే మోసం రాక తప్పదు. కానీ లాక్ డౌన్ ఇలాగే కొనసాగించడం కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటికే వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. లక్షలాది మంది ఉపాధి లేక పస్తులుంటున్నారు. ఈ నేపథ్యంలో లాక్ తీసేయాలన్నదే ఎక్కువ మంది అభిప్రాయంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ సైతం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈనెల 17తో ముగియనుంది. అనంతరం దానిని పొడిగించాలా లేక షరతులతో ఎత్తివేయాలా అనే అంశంపై మేధోమథనం జరుగుతోంది. నిజానికి లాక్ డౌన్ వల్ల కేసులను బాగానే నిరోధించగలిగాం. లేకుంటే దేశంలోకి నేటికి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగేదని, లాక్ డౌన్ వల్లే వాటిని అడ్డుకోగలిగామని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగింపే సరైనదని కొంతమంది అభిప్రాయపడుతుండగా.. దీర్ఘకాలిక లాక్ డౌన్ మంచిది కాదని, దానివల్ల ఆకలి చావులు పెరిగే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు.

వాస్తవానికి లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా కుదేలైంది. దీనిని తిరిగి గాడిన పెట్టడం అంత ఆషామాషీ కాదు. దీంతో లాక్ డౌన్ ఎత్తివేసి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించాలని పలు దేశాలు యోచిస్తున్నాయి. అయితే, లాక్ డౌన్ సడలించిన దేశాల్లో వైరస్ వ్యాప్తి ముమ్మరం కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియా, జర్మనీల్లో మళ్లీ కేసులు పెరిగాయి.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ, ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నాయి. ఇన్నాళ్లూ ఇళ్లలోనే ఉండాలంటూ ప్రచారం చేసిన బ్రిటన్.. తాజాగా అప్రమత్తంగా ఉండాలని తన నినాదం మార్చింది. అంటే, ప్రజా జీవనం మామూలుగా మారినప్పటికీ, ప్రజలు తమకు తాముగా అప్రమత్తంగా ఉండాలని, కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించాలని చెబుతున్నాయి. ఈనెల 18 నుంచి మనదేశంలోనూ లాక్ డౌన్ ఎత్తివేసినా.. ప్రజలు మాత్రం తమను తామే రక్షించుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించి చేసేదేమీ లేదు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: ప్రియురాలిని ఎర వేసి చెల్లి ప్రియుడిని చంపేసిన..

తన చెల్లిని ప్రేమించాడు అంటూ 19 యేళ్ల దినేశ్‌ను వంశీ చంపేశాడు. ప్రకాశం జిల్లా చీరాలలో ఈ సంఘటన జరిగింది. హరీష్‌ పేటకు చెందిన దినేశ్‌ కొన్నాళ్లుగా సంధ్యను ప్రేమిస్తున్నాడు. ఆమె కుటుంబ...

రోడ్డెక్కిన బస్సులు.. భయం భయంగానే ప్రయాణం.!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ముందుంది. తెలంగాణలో ఇప్పటికే బస్సులు రోడ్డెక్కగా, ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఛార్జీల పెంపు...

ఫ్లాష్ న్యూస్: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు, ముగ్గురు మృతి

విజయవాడ, హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీ యాక్సిడెంట్‌ జరిగింది. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆగి ఉన్న ధాన్యం లారీని వెనుక నుండి వచ్చి కారు ఢీ...

హ్యాపీ లేని నెస్ట్ మాకెందుకు?

ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నిర్మించి ఇచ్చే హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లపై కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో తాము అందులో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపించామని,...

బాలయ్య – బోయపాటి.. ఓ సస్పెన్స్ డ్రామా

నందమూరి బాలకృష్ణ - సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనులది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ మొదట కలిసి చేసిన సింహా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ ఇద్దరూ...