Switch to English

మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మే 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ దేశంలో కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే, రెడ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కరినంగా అమలు కానుండగా, గ్రీన్‌ మరియు ఆరెంజ్‌ జోన్లకు చాలా వెసులుబాట్లు కల్పించారు.

అన్ని జోన్లలోనూ సినిమా ది¸యేటర్లు, విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాలు, రెస్టారెంట్లు, మతపరమైన కేంద్రాల మూసివేత కొనసాగుతుంది. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఇళ్ళకే పరిమితం కావాల్సి వుంటుంది. ఇక, ఆరెంజ్‌ జోన్లలో కొన్ని వెసులుబాట్లు కల్పించగా, గ్రీన్‌ జోన్లలో అన్నిరకాల కార్యకలాపాలకూ అనుమతినివ్వడం గమనార్హం. 50 శాతం ప్రయాణీకులతో బస్సులు కూడా గ్రీన్‌ జోన్‌లో తిరుగుతాయి. గ్రీన్‌ జోన్లలో మద్యం దుకాణాలకు సైతం అనుమతినివ్వడం గమనార్హం.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూనే, పాన్‌ – గుట్కా వంటి విక్రయాలకు ‘గ్రీన్‌’ సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం. ఆయా దుకాణాల్లో ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువమంది వుండకూడదు.. సోషల్‌ డిస్టెన్స్‌ తప్పనిసరి.

ఇదిలా వుంటే, దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ని పొడిగిస్తున్నట్లు కేంద్రం చెబుతున్నా, గ్రీన్‌ మరియు ఆరెంజ్‌ జోన్లలో కొన్ని కార్యకలాపాలకు ‘గ్రీన్‌’ సిగ్నల్‌ ఇవ్వడం విశేషమే మరి.

మరోపక్క, లాక్‌డౌన్‌ అనంతరం తెరచుకునే విద్యా సంస్థలకు సంబంధించి కూడా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. విద్యా సంస్థల్లో కొత్త సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ తప్పనిసరి. షిఫ్టుల వారీగా క్లాసులు.. ఉదయాన్నే స్కూల్‌లో నిర్వహించే ‘అసెంబ్లీ’ సహా స్పోర్ట్స్‌ వంటివి రద్దు చేయాలని సూచించింది కేంద్రం. కాగా, కేసుల సంఖ్య తగ్గే కొద్దీ రెడ్‌ జోన్లు తగ్గుతాయనీ, గ్రీన్‌ జోన్లు పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది.

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీకి క్రెడిట్‌ ఇస్తారెందుకు.!

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: దున్నపోతును హింసించారు.. ఎలా పగ తీర్చుకుందో తెలుసా..

కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనం చేసిన పనులే మనల్ని వెంటాడుతూ మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. కొంతమంది ఆకతాయిలు చేసిన ఆ తుంటరి పనే వారికి కర్మ రూపంలో జరిగింది. తనను...

టీటీడీ భూముల అమ్మకంపై వైసీపీ ‘రివర్స్‌ గేర్‌’ వెనుక.!

‘అవి నిరర్ధక ఆస్తులు.. చిన్న చిన్న భూములు కావడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.. కబ్జాలనుంచి వాటిని రక్షించడం వీలు కావడంలేదు. ఈ క్రమంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే తప్పేంటి.?’ ఓ మంత్రిగారు చెప్పిన మాట...

జ‘గన్‌’ ‘ 151: ఆ ఘనతకు ఏడాది.!

సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ ఢంకా మోగించింది. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది....

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, అలాగే రానున్న ఏడాది...

బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం...