కరోనా అనే మహమ్మారి ప్రపంచం మీద విజృంభించిన విధానం అంతా ఇంతా కాదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో సగటు మనిషి నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అన్నీ మూత పడ్డాయి. అందులో సినీ పరిశ్రమ కూడా ఒకటి. ఇటీవలే తెలంగాణ సీఎం జూన్ నుంచి షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచనలో ఉందని తెలియడంతో సినీ పరిశ్రమలో చిన్నపాటి ఆనందం మొదలైంది.
లాక్ డౌన్ టైంకి మే లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు మరియు మిగిలిన స్టార్ హీరోల సినిమాలు ఎంత వరకూ షూటింగ్ జరుపుకున్నాయి అనేది ఒకసారి చూద్దాం..
> ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ దాదాపు 70- 75% షూటింగ్ అయ్యిందని ఇది వరకే రాజమౌళి తెలిపారు. ఇంకా అలియా భట్ ఎపిసోడ్స్ రామ్ చరణ్ – అలియాభట్ సీన్స్ తీయాల్సి ఉంది.
> మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ఇప్పటి వరకూ 30 రోజుల షూటింగ్ చేశారు. దీని ద్వారా 40% షూటింగ్ పూర్తయ్యింది.
> నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా 50% షూటింగ్ పూర్తి చేసుకోగా 50% షూటింగ్ బాలన్స్ ఉంది.
> పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా 75% పూర్తి చేసుకుంది. ఇంకా పవన్ కళ్యాణ్ 20 రోజులు షూటింగ్ లో పాల్గొంటారు.
> యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పీరియడ్ లవ్ స్టోరీ ‘ఓ డియర్/ జాన్’ ఇప్పటికి 70% పూర్తికాగా, మిగిలిన 30% కోసం అబ్రాడ్ సెటప్స్ ని హైదరాబాద్ లో వేయనున్నారు.
> యంగ్ హీరోస్ అయిన నాని, విజయ్ దేవర కొండలు చేస్తున్న ‘టక్ జగదీష్’, ‘ఫైటర్’ సినిమాలు కేవలం 40% షూటింగ్ అయ్యింది.
> గోపీచంద్ ‘సీటిమార్’ సినిమా 30% షూటింగ్ జరుపుకోగా మరో 70% బాలన్స్ ఉంది.
> నితిన్ ‘రంగ్ దే’ సినిమా 60% పూర్తి చేసుకోగా, అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ 75% పూర్తి చేసుకుంది. అలాగే అల్లరి నరేష్ ‘నాంది’, శర్వానంద్ ‘శ్రీకారం’లు దాదాపు 80% పూర్తిచేసుకోగా మరో 20% బాలన్స్ ఉంది.
> నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, రవితేజ ‘క్రాక్’, రానా ‘విరాటపర్వం’, సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటరు’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’, సందీప్ కిషన్ ‘A1 ఎక్స్ ప్రెస్’ మరియు ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ సినిమాలు ఇప్పటికే 90% పూర్తి చేసుకోగా, 10% మాత్రమే బాలన్స్ ఉన్నాయి.ఈ సినిమాలన్నీ మేలో రిలీజ్ కావడానికి షెడ్యూల్ అయి ఉన్నవి.
> నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేస్తున్న సినిమా కేవలం 13 రోజులే షూటింగ్ జరుపుకుంది . అలాగే వరుణ్ తేజ్ బాక్సర్ సినిమా కూడా కేవలం 15 రోజులే షూట్ జరిగింది.
625160 102188Merely wanna input that you have a very good web site , I really like the pattern it actually stands out. 910820
169128 806331Spot lets start work on this write-up, I in fact believe this wonderful web site requirements additional consideration. Ill more likely be once once more you just read additional, thank you that details. 958240
673729 369391I conceive this web internet site contains some rattling amazing info for everyone : D. 275956