Switch to English

లాక్ డౌన్ 4: ఏపీలో కొత్త సడలింపులు ఇవే.. కేంద్రం అనుమతిచ్చేనా.?

ఈ నెల 18వ తేదీ నుంచి ‘లాక్‌డౌన్‌ 4.0’ అమల్లోకి రాబోతోంది. ఏ క్షణాన అయినా, ఈ ‘లాక్‌ డౌన్‌ 4.0’కి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల కావొచ్చు. కేంద్రం, ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్రాల నుంచి కొన్ని అభిప్రాయాల్ని కూడా సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఓ ‘సూచన’ కేంద్రానికి ‘సడలింపుల’ విషయమై వెళ్ళిందట. అందులో, కొన్ని దుకాణాలు ప్రతిరోజూ తెరిచి వుండేలా కాకుండా, రోజు తప్పించి రోజు మాత్రమే తెరిచి వుండేలా డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. సోమ, బుధ, శుక్రవారాల్లో తెరిచే దుకాణాల విషయానికొస్తే, ఆటోమొబైల్స్‌, మొబైల్‌ షాప్స్‌, హార్డ్‌వేర్‌, శానిటరీ, ఐరన్‌ షాప్‌, సైకిల్‌ షాప్‌, ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, వెస్సెల్స్‌కి అవకాశమిస్తారు. ప్రతిరోజూ తెరుచుకునే దుకాణాల్లో స్వీట్స్‌ అండ్‌ బేకరీ, ఫ్రూట్స్‌, వెజిటబుల్స్‌, మిల్క్‌, మెడికల్‌ అండ్‌ గ్రోసరీ, ఆటోగ్యారేజ్‌లుంటాయి. మంగళవారం, గురువారం, శనివారం విషయానికొస్తే, రెడీమేడ్‌ గార్మెంట్స్‌, వస్త్రాలయ, ఫుట్‌వేర్‌, ప్రింటింగ్‌ ప్రెస్‌, ఆప్టీషియన్‌, బుక్‌ అండ్‌ స్టేషనరీ, ఫర్నిచర్‌ – బ్యాగ్‌, జ్యుయెలరీ షాప్స్‌, టెయిలరింగ్‌, కాస్మెటిక్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌కి అవకాశమిస్తారు.

ఇదిలా వుంటే, ‘లాక్‌డౌన్‌ 4.0’ వెసులుబాట్ల విషయమై రాష్ట్రాలకే అధికారాలు కట్టబెట్టాలని కేంద్రం యోచిస్తున్న దరిమిలా, రాష్ట్రం నుంచి వెళ్ళిన ప్రతిపాదనలకు పూర్తిస్థాయిలో ఆమోదం లభించవచ్చు. అంటే, పైన పేర్కొన్నవన్నీ మే 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇదిలా వుంటే, రెడ్‌ జోన్లలో మాత్రం ఆంక్షలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్టీసీ బస్సులు నడిపే విషయంలోనూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ మల్లగుల్లాలు పడుతోంది. సీట్ల మధ్య గ్యాప్‌ వుంచడం సహా అనేక ఆలోచనలు ఇప్పటికే చేసిన జగన్‌ సర్కార్‌, రెండు మూడు రోజుల్లోనే ప్రజా రవాణాపైనీ కీలక నిర్ణయం తీసుకోవచ్చు.

లాక్ డౌన్ 4: ఏపీలో కొత్త సడలింపులు ఇవే.. కేంద్రం అనుమతిచ్చేనా.?

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...

ఎక్కువ చదివినవి

ఏపీలో మొదటి రోజే వరుస కేసులతో చంద్రబాబుకి షాక్.!

లాక్ డౌన్ కి ముందు హైదరాబాద్ లో ఉండడంతో లాక్ డౌన్ కాలమంతా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 60 రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం...

టీటీడీ భూముల అమ్మకంపై వైసీపీ ‘రివర్స్‌ గేర్‌’ వెనుక.!

‘అవి నిరర్ధక ఆస్తులు.. చిన్న చిన్న భూములు కావడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.. కబ్జాలనుంచి వాటిని రక్షించడం వీలు కావడంలేదు. ఈ క్రమంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే తప్పేంటి.?’ ఓ మంత్రిగారు చెప్పిన మాట...

బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం...

రానా, మిహీకల నిశ్చితార్ధం నేడే

రానా దగ్గుబాటికి ఇండస్ట్రీలో అల్లరి కుర్రాడిగా పేరుంది. ఇండస్ట్రీలో తన తోటి వయసు నటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండే రానాపై గతంలో కొన్ని లింకప్ రూమర్స్ వచ్చాయి కానీ వాటన్నిటినీ రానా తోసిపుచ్చాడు....

యంగ్ హీరో కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం

ఏ సపోర్ట్ లేకుండా తన ప్రతిభతో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. కెరీర్ మొదట్లో సూపర్ హిట్లు సాధించిన ఈ కుర్రాడు సరైన సినిమాల ఎంపికలో...