Switch to English

లాక్‌డౌన్‌2: అసలు సిసలు పరీక్ష మొదలైంది..

‘జాన్‌ బీ.. జహాన్‌ బీ..’ అని ఈ మధ్యనే జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. దానర్థం, లాక్‌ డౌన్‌ని ఎత్తివేయడమే.. అని కొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి, రెండూ మూడు రోజుల క్రితం నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. దేశంలో కరోనా వైరస్‌ అదుపులోనే వున్నట్లు కన్పించినా, కేవలం రోజుల వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పేసింది. దాంతో, ‘లాక్‌డౌన్‌ సడలింపు’ అన్న ఆలోచనని కేంద్రం పక్కన పెట్టేయాల్సి వచ్చింది.

మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. అయితే, ఏప్రిల్‌ 20 తర్వాత అత్యవసర అంశాలకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు వుండొచ్చు. నిజానికి, కరోనా వైరస్‌కి సంబంధించి అసలు సిసలు పరీక్ష ఇప్పుడే మొదలైందని చెప్పొచ్చు. ‘రెండో దశ దాటి, మూడో దశలోకి ఎంటర్‌ అయ్యాం..’ అని చెప్పడానికి ప్రభుత్వాలు మొహమాటపడుతున్నా, మూడో దశలోకి అడుగుపెట్టేసిన విషయాన్ని కొత్తగా నమోదవుతున్న కేసులు చెప్పకనే చెబుతున్నాయి.

మూడో దశ అంటే ‘కమ్యూనిటీ స్ప్రెడ్‌’ అన్నమాట. మహారాష్ట్రలో ఇది అత్యంత వేగంగా విస్తరిస్తోంది. తమిళనాడులోనూ దాదాపు ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఢిల్లీ సంగతి సరే సరి. ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఆ మాటకొస్తే తెలంగాణలోనూ ‘కమ్యూనిటీ స్ప్రెడ్‌’ దిశగా రకరకాల ప్రచారాలు విన్పిస్తున్నాయి. వీటిల్లో నిజమెంత.? అన్నది ఇప్పటికైతే సస్పెన్సే.

ఎందుకంటే ప్రభుత్వాలే అధికారిక సమాచారాన్ని విడుదల చేయాల్సి వుంది. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితి ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. అంటే, ఇప్పుడే దేశం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుందన్నమాట. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ని కొనసాగించాల్సి వచ్చిందని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

సరే, అదనంగా మరో 19 రోజులు లాక్‌డౌన్‌కి దేశం సిద్ధమయిపోతుంది. కానీ, ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారు. మరి, మరో 19 రోజులు ఎలా.? ‘ఉద్యోగాలు తీసేయొద్దు..’ అని యాజమాన్యాలకు ప్రధాని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ, ఇప్పటికే ‘తీసివేతలు’ షురూ అయ్యాయి. వేతనాల్లో కోతలూ కన్పిస్తున్నాయి.

పేదల్ని ఆదుకునేందుకు మోడీ సర్కార్‌ ముందుకు రావడాన్ని అభినందించాల్సిందే. కానీ, మిడిల్‌ క్లాస్‌ పరిస్థితేంటి.? ఈ పరీక్షని మధ్యతరగతి భారతం తట్టుకునేదెలా.? అసలు దేశం ఈ కరోనా సంక్షోభం నుంచి బయటపడేదెలా.? మే 3 నాటికి పరిస్థితులు అదుపులోకి రాకపోతే, కేసీఆర్‌ ముందే చెప్పినట్లు జూన్‌ 3 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగక తప్పదా.? ఏమో, వేచి చూడాల్సిందే.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

నిశ్చితార్థ వార్తలు కొట్టి పారేసిన సురేష్‌బాబు

ఈ రోజు ఉదయం నుండి కూడా సోషల్‌ మీడియాలో రానా వివాహ నిశిత్చార్థం అంటూ తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. తాను ప్రేమించిన అమ్మాయి మిహీకా బజాజ్‌తో రానా వివాహ నిశ్చితార్థం...

బికినీతో కరోనా పేషంట్‌కు చికిత్స

ఈ కరోనా కారణంగా ఎన్నో కొత్త కొత్త విషయాలు, వింతలు చూడాల్సి వస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా డాక్లర్లు మరియు నర్సులపై ఆదారపడి ఉంటున్నారు. వారు లేకుంటే ఈ...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

50 రోజుల యాక్షన్, ఒక్క ఫైట్ కి 6 కోట్లు @ మంచు మనోజ్.!

కలెక్షన్ కింగ్ మోహన బాబు నట వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన మంచు మనోజ్ పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మనోజ్ కేవలం హీరోగానే కాకుండా తన సినిమాల మ్యూజిక్ విషయంలో,...

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘బాబు’లిద్దరూ హైద్రాబాద్‌లో ఇంకెన్నాళ్ళు.!

సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాది, లక్షలాది పోస్ట్‌లు నిత్యం దర్శనమిస్తున్నాయి. వీటిల్లో మెజార్టీ పోస్ట్‌లు చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు గత కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌కే పరిమితమవడంపై...