లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,626FansLike
57,764FollowersFollow

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు. ఆ సెగ, తెలంగాణకీ తాకింది. తెలంగాణలో అప్పట్లో అధికారంలో వున్న బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె జైలుకు వెళ్ళడం కూడా చూశాం.

ఏపీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దదని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ కూడా ఇవ్వడం మరో ఆసక్తికర అంశం. వైఎస్ జగన్ హయాంలో, ఈ లిక్కర్ స్కామ్ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. వేల కోట్లు, దేశం నుంచి అక్రమంగా తరలించారనే ఆరోపణలూ వున్నాయి.

ఈ కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి అరెస్టయ్యారు. సహజంగానే వైసీపీ నుంచి, ‘అన్యాయం, అక్రమం’ అంటూ, ఏడుపులు పెడబొబ్బలు షురూ అయ్యాయి.

వైసీపీ హయాంలో ప్రభుత్వమే, మద్యం దుకాణాల్ని నిర్వహించింది. దాదాపు అన్ని డిస్టిలరీలు, వైసీపీ అధినాయకత్వం కనుసన్నల్లోనే నడిచాయి. పైగా, నకిలీ బ్రాండ్లను మార్కెట్‌లోకి తెచ్చి మరీ. అబ్బే, అవి నకిలీ బ్రాండ్లు కావు.. అని వైసీపీ బుకాయించిందిగానీ, జనం ఆ నకిలీ బ్రాండ్ల మీద పూర్తి స్పష్టతతో వున్నారు.. వైసీపీకి గత ఎన్నికల్లో పాతరేశారు కూడా.

దేశ వ్యాప్తంగా అందుబాటులో వున్న మద్యం బ్రాండ్లు ఏవీ, రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇదే, మద్యం కుంభకోణం.. అనడానికి ప్రధాన కారణమంటారు రాజకీయ పరిశీలకులు. మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసి, ‘ధరలు పెంచడం వల్ల మద్యం తాగేవారి సంఖ్య తగ్గుతుంది’ అనే పిచ్చి లాజిక్ కూడా వైసీపీ హయాంలోనే తెరపైకొచ్చింది.

ధరలు పెంచి, ఆ తర్వాత తగ్గించి.. వైసీపీ, మద్యం విషయంలో ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రతి రూపాయీ అక్రమంగా వైసీపీ అధినాయకత్వం జేబుల్లోకే వెళ్ళిందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో, ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి అరెస్టు తర్వాత, వైసీపీలో గగ్గోలు తారాస్థాయికి చేరింది. ‘లేని స్కామ్‌ని వుందని నిరూపించేందుకు కుట్ర..’ అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలు, వైసీపీ ఆర్తనాదాల్లా వినిపిస్తున్నాయన్న చర్చ అంతటా జరుగుతోంది.

వందల కోట్లు కాదు, వేల కోట్ల కుంభకోణం వైసీపీ మద్యం విధానంలో వుందన్న ఆరోపణల్లో తదుపరి అరెస్ట్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనన్న ప్రచారం జరుగుతుండడం కొసమెరుపు.

సినిమా

NBK111: బాలకృష్ణ-గోపీచంద్ సినిమాలో మరో క్రేజీ హీరో..! కీలక అప్డేట్ ఇచ్చిన...

NBK111: నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #NBK111 గా తెరకెక్కుతున్న సినిమా చారిత్రక నేపథ్యంలో...

రమణి కళ్యాణం ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్.. ఫీల్‌గుడ్ ప్రేమకథపై పెరిగిన ఆసక్తి

ఈ మధ్యకాలంలో భారీ యాక్షన్‌, మాస్ హంగామా కంటే హృదయానికి దగ్గరయ్యే క్లీన్ ఎమోషనల్ కథల వైపు ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి...

Jr.Ntr: ‘వాళ్ల ఆశలు నెరవేరేదెప్పుడో మరి..’ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

Jr.Ntr: ప్రతి ఏటా తమ అభిమాన హీరో పుట్టినరోజు అభిమానులకు పండగ. తమ హీరో కొత్త సినిమా కబురు కోసం వెయిట్ చేస్తారు. హీరోకు శుభాకాంక్షలు...

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్, ఐ ఫీస్ట్.. ‘డ్రాగన్’...

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలను మోసుకుంటూ వచ్చిన ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ వారి ఎదురుచూపులకు తెర దించింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్...

Peddi: రికార్డులతో హోరెత్తిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్.. సెన్సేషనల్ నెంబర్స్ ఇవి..

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్ దేశవ్యాప్తంగా విధ్వంసమే సృష్టించింది. బుచ్చిబాబు...

రాజకీయం

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం: లోకేష్

అమరావతిలో రాష్ట్రవ్యాప్తంగా డీఈవోలు, ఏపీసీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Nara Lokesh ప్రభుత్వ విద్యావ్యవస్థలో తీసుకురానున్న కీలక మార్పులపై విస్తృతంగా మాట్లాడారు. “దేశానికే ఆదర్శంగా ఆంధ్ర...

ఆసియా క్రీడలకు ఎంపికైన జ్యోతి సురేఖకు మంత్రి లోకేష్ అభినందనలు

అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశానికి గుర్తింపు తీసుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ Vennam Jyothi Surekha ఈ ఉదయం ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh...

గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. జియో ట్యాగింగ్‌తో రోడ్ల పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్ గ్రామాల సమగ్రాభివృద్ధికి పారదర్శక సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరమైన వసతులు,...

మత్స్యకార ఇంటికి వెళ్ళి గరిటె తిప్పిన చంద్రబాబు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో మంగళవారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఓ మత్స్యకార కుటుంబం ఇంటికి వెళ్లి వారితో కలిసి సాధారణ వ్యక్తిలా...

వంద బోట్లతో సీఎం ఇంటికి మత్స్యకారులు.. లోకేష్ ఆత్మీయ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండో ఏడాది “మత్స్యకారుల సేవలో” నిధులను విడుదల చేయడంతో మత్స్యకారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణానదిపై సుమారు వంద బోట్లలో భారీగా తరలివచ్చిన మత్స్యకారులు సీఎం చంద్రబాబు నాయుడు...

ఎక్కువ చదివినవి

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన మెగాస్టార్ Chiranjeevi చేసిన కామెంట్స్ ఇప్పుడు...

వంద బోట్లతో సీఎం ఇంటికి మత్స్యకారులు.. లోకేష్ ఆత్మీయ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండో ఏడాది “మత్స్యకారుల సేవలో” నిధులను విడుదల చేయడంతో మత్స్యకారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణానదిపై సుమారు వంద బోట్లలో భారీగా తరలివచ్చిన మత్స్యకారులు సీఎం చంద్రబాబు నాయుడు...

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

ఆసియా క్రీడలకు ఎంపికైన జ్యోతి సురేఖకు మంత్రి లోకేష్ అభినందనలు

అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశానికి గుర్తింపు తీసుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ Vennam Jyothi Surekha ఈ ఉదయం ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు ‘పెద్ది’పై పాజిటివ్‌గా మాట్లాడటం ఇండస్ట్రీలో ఆసక్తికర...