Switch to English

లిక్కర్ మేనియా: కరోనా కూడా సిగ్గుపడాల్సిందేనేమో.!

ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలో పశ్చమ బెంగాల్ తదితర రాష్ట్రాలు నేటి నుంచి మద్యం షాపుల్ని బార్లా తెరిచాయి. ఇంకేముంది.? మద్యం షాపుల వద్ద మందు బాబులు ‘క్యూ’ కట్టేశారు. ఆంధ్రపదేశ్ విషయానికొస్తే, ఓ పెద్ద హీరో కొత్త సినిమా రిలీజ్ రోజున థియేటర్ల వద్ద పరిస్థితి ఎలా వుంటుందో.. అదే పరిస్థితి మద్యం దుకాణాల వద్ద కన్పిస్తోంది. సోషల్ డిస్టెన్స్ అన్న మాటకే తావు లేకుండా పోతోంది.

మద్యం ధరలు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, మద్యపానమే ముఖ్యం.. కరోనాతో ప్రాణం పోయినా లెక్క చేయడం.. అన్నట్లు మందుబాబులు వ్యవహరిస్తుండడం గమనార్హం. రాష్ట్రంలోని కొన్ని చోట్ల అయితే కిలో మీటర్ మేర మందు బాబులు బారులు తీరిన పరిస్థితి కూడా కన్పిస్తోంది.

కొన్ని చోట్ల క్యూలైన్లు దర్శనమిస్తోంటే.. చాలా చోట్ల సంత మార్కెట్లను తలపిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంకెందుకు సోషల్ డిస్టెన్స్? ఇంకెందుకు కరోనా పేరుతో లాక్ డౌన్.? అన్న చర్చ సర్వ్రతా జరుగుతోంది. ఒక్కడు చాలు.. ఓ గ్రామం కొంప ముంచేయడానికి.. ఒక్కడు చాలు.. ఓ నగరాన్ని సర్వనాశనం చేసెయ్యడానికి.. అన్నట్లున్నాయి కరోనా పరిస్థితులు దేశంలో.

ఓ వ్యక్తి పేకాట పైత్యం 25 మందికి కరోనా వచ్చేలా చేసిందని విన్నాం. ఓ మహిళ అష్టా చెమ్మా ఆడి 30 మందికి కరోనా అంటించిందని చదువుకుంటున్నాం. మరి, మద్యం దుకాణాల వద్ద ఈ స్థాయిలో జనం బారులు తీరితే.. కరోనా ఇంకెంత చెలరేగిపోతుందట.? కనీసపాటి ఇంగితం కూడా లేకుండా ప్రభుత్వాలు కాసుల కక్కుర్తితో మద్యం దుకాణాలు తెరవడం అత్యంత హేయమనే విమర్శలు ఓపక్క విన్పిస్తోంటే.. మద్యానికి బానిసైనవాళ్ళు కల్తీ మద్యం వైపు మళ్ళుతున్నారనీ.. ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాల్ని తెరవడమే మంచిదన్నది అధికార పార్టీల వాదన.

ఎవరి వాదనలు ఎలా వున్నా, ముందు ముందు దేశంలో కరోనా మహమ్మారి చెలరేగిపోతే మాత్రం దానికి కారణం మద్యం దుకాణాల్ని తెరుస్తున్న ప్రభుత్వాలే అవుతాయి.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: ఏపీలో విమానం దిగాలంటే ఈ కండీషన్స్‌ తప్పనిసరి

నిన్నటి నుండి దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఏపీలో విమానాలు మొదలు కాలేదు. ఏపీకి రావాలంటే కొన్ని కండీషన్స్‌ ను పెడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య...

కరోనా అలర్ట్‌: మారటోరియం.. మళ్ళీ వచ్చిందిగానీ..

కరోనా వైరస్‌ దెబ్బకి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఈ నేపథ్యంలో లోన్లు తీసుకున్నవారికి కాస్త ఉపశమనం కల్పించేలా ఆర్బీఐ గతంలోనే మూడు నెలల మారటోరియం ప్రకటించిన విషయం విదితమే. ఈ నెలాఖరుతో ఈ...

‘‘లవ్ స్టోరీ’’ నిర్మాత తోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా కన్ఫార్మ్

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫార్మ్ అయ్యింది.ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి లతో 'లవ్ స్టోరీ' మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల...

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ గిఫ్ట్.. ఎప్పుడైతే అప్పుడే

తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళి శైలి వేరు. ప్రమోషన్స్ కు చాలా ప్రాధాన్యతను ఇస్తాడు జక్కన్న. తన హీరోల్ని ప్రోజెక్ట్ చేయడంలో కూడా ముందుంటాడు. బాహుబలికి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటూ హైప్...

బాలయ్య – బోయపాటి.. ఓ సస్పెన్స్ డ్రామా

నందమూరి బాలకృష్ణ - సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనులది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ మొదట కలిసి చేసిన సింహా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ ఇద్దరూ...