జమైకాలోని ఓ జూలో సింహంతో జూకీపర్ చూపిన అత్యుత్సాహం తన చేతి వేలిని పోగొట్టుకునేలే చేసింది. దిగ్భ్రాంతి కలిగించిన ఈ ఘటనలో జూ కీపర్ వేలిని సింహం కొరికేయడంతో అతను తీవ్రంగా ప్రతిఘటించాడు. జరుగుతున్న ఘటనను విజిటర్లు సరదా ప్రయత్నం అనుకున్నారు కానీ.. జూకీపర్ విలవిల్లాడిపోవడంతో వాస్తవంలోకి వచ్చారు. వివరాల్లోకి వెళ్తే..
కంచె లోపలే ఉన్న సింహాన్ని జూకీపర్ ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. ఆక్రమంలో సింహాన్ని రెచ్చగొడుతూ కంచె లోపలకి అతడి చేయిని పెట్టాడు. అప్పటికే గాండ్రిస్తున్న గజరాజు ఒక్కసారిగా అతడి చేయిని పట్టేసింది. దీంతో చేయిని విడిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నమే చేశాడు. కానీ.. సింహం పట్టిన పట్టుకు అతడి చేయి రాకపోగా ఆ ప్రతిఘటనలో అతడి వేలు ఊడిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ సన్నివేశం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఘటనపై జూ యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరుగకుండా చూస్తామంటోంది. ఘటనపై విచారణ చేపడతామని ‘జమైకా సొసైటీ ఫర్ ది ప్రివెన్షనల్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్’ సంస్థ అంటోంది.
Never seen such stupidity before in my life. pic.twitter.com/g95iFFgHkP
— Mo-Mo💙 (@Morris_Monye) May 22, 2022