విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టులో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ ను ముగించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నాడు. ఛార్మితో కలిసి స్వీయ దర్శకత్వంలో పూరి ఈ సినిమాను నిర్మించాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందింది. కేవలం తెలుగు ప్రేక్షకుల కోసం అన్నట్లుగా కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కొన్ని సన్నివేశాలను స్పెషల్ గా హిందీలో తెరకెక్కించడం జరిగింది.
సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈ లోపే లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు. మే 9 న లైగర్ నుండి సర్ ప్రైజ్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సర్ ప్రైజ్ ఏంటీ అనేది చూడాలి. మే 9వ తారీకున అతడు రాబోతున్నాడు.. వేట ఆరంభం అవుతుంది అంటూ వార్నింగ్ పోస్టర్ ను లైగర్ టీమ్ విడుదల చేయడం జరిగింది. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది.