Life Stories: సత్య కేతినీడి, షాలిని కొండేపూడి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన సినిమా #లైఫ్ స్టోరీస్. అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోంది. ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వం వహించిన సినిమా సెప్టెంబర్ 14న విడుదల కానుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురైన అనుభవాలు, రోజువారీ క్షణాల్ని మనసుకు హత్తుకునే విధంగా సినిమా కథాంశం ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
వివిధ వయసుల వ్యక్తులు, వ్యక్తిత్వాలు, ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో సినిమా ఉంటుందని.. సాధారణ సంఘటనలు మన జీవితాలపై ఎలా తీవ్ర ప్రభావం చూపగలవో సినిమాలో చూపిస్తున్నామని దర్శకుడు ఉజ్వల్ అంటున్నారు.
యానిమేటర్ నుంచి లైవ్-యాక్షన్ ఫిల్మ్ మేకింగ్ వైపు వచ్చారు ఉజ్వల్ కశ్యప్. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమా తెరకెక్కించినట్టు తెలిపారు. అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్లో నిర్మాత విజయ జ్యోతి సినిమా నిర్మించారు. విన్ను సంగీతం అందిస్తున్నారు.