Switch to English

న్యూ ట్విస్ట్‌: సుప్రీంను ఆశ్రయించిన ఎల్జీ పాలిమర్స్‌

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎల్జీ పాలిమర్స్‌ సంస్థకు చెందిన పరిశ్రమ నుంచి విషవాయువులు లీక్‌ అవడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ఘటనపై ప్రభుత్వం ఆఘమేఘాలమీద స్పందించి మృతుల కుటుంబాలకు కోటి చొప్పున ప్రకటించడమే కాకుండా, తీవ్ర అస్వస్థతకు గురైనవారికి, స్వల్ప అస్వస్థతకు గురైనవారికీ పెద్దయెత్తున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

మొత్తంగా 15,000 మంది ప్రజలు ప్రభావిత ప్రాంతంలో వున్నట్లు అంచనా వేసిన ప్రభుత్వం, వారందరికీ కలిపి ప్రత్యేకంగా ప్యాకేజీని ప్రకటించడం తెల్సిన విషయమే. ఇంతకీ, ఈ మొత్తం ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ ఏం చేయబోతోంది.? కోర్టును ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ఆశ్రయించడమంటే, పరిహారం ఎగ్గొట్టడానికేనన్న వాదన విన్పిస్తోంది.

ఘటనపై వెంటనే స్పందించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తక్షణ జరీమానా కింద 50 కోట్లు చెల్లించాలని ఎల్జీ పాలిమర్స్‌ సంస్థని ఆదేశించగా, ఆ ఆదేశాల్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ. ‘ఎల్జీ పాలిమర్స్‌ నుంచి పరిహారం గురించి మేం మేం మాట్లాడుకుంటాం..’ అని ఘటన జరిగాక విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయిన విషయం విదితమే.

ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. ఆ సంస్థ ఏమాత్రం పరిహారం చెల్లించేందుకు సుముఖంగా లేదనే విషయం తేటతెల్లమయిపోయింది. సంస్థకు బదులుగా ప్రభుత్వమే తన చేతి చమురు వదలించుకున్నట్లయ్యింది. నిజానికి, దేశమే ఉలిక్కిపడేలా చేసిన ఇంతటి దుర్ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ సంస్థకు భారీ జరీమానా విధించాల్సి వుందన్నది నిపుణుల అభిప్రాయం. కోటి కాదు.. మరణించిన వ్యక్తికి 10 కోట్ల చొప్పున పరిహారం సంస్థ నుంచి రాబట్టినా తక్కువేనన్న వాదన విన్పిస్తోంది.

తీవ్ర అస్వస్థతకు గురైనవారు, గ్యాస్‌ లీక్‌ కారణంగా ఏళ్ళ తరబడి అనారోగ్యానికి గురయ్యేవారు.. ఇలా బాధితులకు పరిహారం.. వందల కోట్లలో చెల్లిస్తేనే కాస్తో కూస్తో న్యాయం జరిగినట్లవుతుందని పరిశ్రమల వ్యవహారాల్లో నిపుణులైనవారు స్పష్టం చేస్తున్నారు.

ఇటు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అటు ఎల్జీ పాలిమర్స్ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై మొదటి నుంచీ జనసేన పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఆ అనుమానాలే నిజమవుతున్నాయని సుప్రీంకోర్టుని ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఆశ్రయించడంపై జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన బొలిశెట్టి సత్యనారాయణ అభిప్రాయ పడ్డారు.

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

భయపెడుతున్న ‘నిసర్గ’ తుఫాన్‌

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి దిశగా కదులుతోంది. ఈ తుఫాన్‌తో మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు పలు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందంటూ వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్‌...

రివ్యూ : రక్తాంచల్ (వెబ్ సిరీస్)

నటీనటులు : నికితిన్ ధీర్, క్రాంతి ప్రకాష్ ఝా, సౌందర్య శర్మ, రోంజిని చక్రవర్తి, చిత్తరంజన్ త్రిపాఠి తదితరులు. నిర్మాణం : ఎంఎక్స్ ప్లేయర్ దర్శకత్వం: రితమ్ శ్రీవాస్తవ్ నిడివి : 86 నిముషాలు విడుదల తేది :...

ఆ కుర్రాడు పాములా నెలకు ఒకసారి కుబుసాన్ని వదులుతూ ఉంటాడు

పాములు తమ చర్మ అమరిక అనుసారంగా కుబుసంను వదులుతూ ఉంటాయి. పాములు కుబుసం వదలడం చాలా కామన్‌ విషయం. కాని ఒక మనిషి పాము మాదిరిగా కుబుసం వదలడం ఎప్పుడైనా చూశారా. మనిషి...

గ్రాము తేలు విషం రూ. 7.3 లక్షలు, అది ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

పాము కుట్టినా, తేలు కుట్టినా కూడా ప్రాణం పోయినంత మంటగా నొప్పిగా ఉంటుంది. కొన్ని పాములు మరియు తేలు కుడితే వెంటనే మృతి చెందుతారు. కాని కొన్ని రకాల పాములు తేల్లు కుడితే...

సినిమా జోనర్ చెప్పండి …సర్ప్రైజ్ గిఫ్ట్స్ గెలుచుకోండి.!

అ!, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమా ‘వ్యాక్సీన్ వస్తుంది’ (వర్కింగ్ టైటిల్). కరోనా వైరస్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర సినిమా ప్రీలుక్, మోషన్ పోస్టర్ శుక్రవారం తన...