Leo: విజయ్ (Vijay) హీరోగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లియో. తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై ఓ న్యూస్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. యూకేలో ఈ సినిమాను రా వెర్షన్ (అన్ కట్ వెర్షన్) రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ మిస్ కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కొన్ని రోజుల తర్వాత 12ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వారికి ఫ్రెండ్లీ వెర్షన్ రిలీజ్ చేస్తామని తెలిపింది.
ఇండియాలో ఇలా జీరో కట్స్ వెర్షన్ రిలీజ్ కష్టమనే అంటున్నారు. వచ్చే అక్టోబర్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఇప్పటికే యూకేలో బుకింగ్స్ ఓపెన్ చేయగా 24గంటల్లోనే 10వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోవడం విశేషం. మాస్టర్ తర్వాత లోకేశ్-విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడం.. విక్రమ్ తర్వాత లోకేశ్ కనగరాజ్ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.
Great post. I was checking continuously this weblog and I’m impressed!
Very useful info particularly the remaining section 🙂 I deal with
such information much. I was looking for this
certain information for a long time. Thank you and best of luck.