Kota Srinivasa Rao: ‘కోటన్నా..’ ఇదైతే నేను ఖండిస్తున్నా..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,376FansLike
57,764FollowersFollow

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు.. తెలుగు చిత్రసీమ మర్చిపోలేని పేరు. విలక్షణమైన నటన అనే పదానికి నూరు శాతం న్యాయం చేసిన నటుడు ఆయన. పాత్రలోకి పరకాయ ప్రవేశం అనే మాటకు న్యాయం చేసిన నటుడు. కమెడియన్, విలన్, తండ్రి, తాత, మావయ్య.. ఇలా ఆయన చేయని పాత్ర లేదు. అన్నింట్లోనూ ప్రత్యేకతే. సినిమాలో కోట కోసం ప్రత్యేకంగా రాసుకున్న పాత్రలు ఉన్నాయి. ఆయనే నటించాలని పట్టుబట్టిన హీరో, దర్శక, నిర్మాతలు ఉన్నారు. అంతటి విలక్షణ నటుడు ఇక నుంచి ‘ఓ జ్ఞాపకం’లా మిగిలిపోవడం జీర్ణించుకోలేనిది. హలో బ్రదర్.. సినిమాలో ఆద్యంతం నవ్వించిన ఆయనే.. మల్లిఖార్జునరావు పాత్ర చనిపోతే తనదైన నటనతో ఏడిపిస్తారు. ‘ఇకనుంచి నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవరు కరెక్ట్ చేస్తార్రా’ అని. ఇప్పుడూ పరిశ్రమ, ప్రేక్షకులు అదే అంటున్నారు.. ‘ఇక నుంచి ఎవరు నవ్విస్తారయ్యా’ అని.

ఎస్వీ రంగారావు, గుమ్మడి, రావుగోపాలరావు, సత్యనారాయణ హవా తర్వాత.. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అంతటి స్థాయిని అందుకున్నారు కోట. కమెడియన్, విలన్, పిసినారి, మధ్యతరగతి తండ్రి.. ఏ పాత్రలోనైనా ఆయన ఒదిగిపోయేవారు. బాబూమోహన్-కోట జంట కామెడీతో తెలుగు సినిమాను ఓ ఊపు ఊపేశారు. మామగారు నుంచి ఓ 50 సినిమాల్లో తమ అల్లరితో నవ్వులు పండించారు.  ‘అహనా.. పెళ్లంట’లో బ్రహ్మానందంలో కలిసి పిసినారి సీతాపతి పాత్ర ఇప్పటికీ ప్రతి తెలుగింట్లో చక్కిలిగింతలు పెడుతూనే ఉంటుంది.విలనిజంలోనూ అత్యంత క్రూరంగా నటించేవారు. ‘గాయం’లో.. ‘ఇదైతే నేను ఖండిస్తున్నా’ అని నవ్విస్తూనే విలనిజం రక్తికట్టించారు. ‘గణేశ్’లో వైద్యశాఖ మంత్రిగా ఆయన గాంభీర్యం పీక్స్. రూపంలో ఎంతో పద్దతిగా వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో ప్రేక్షకులు లీనమైపోయారంటే అతిశయోక్తి కాదు.

తెలుగు సినిమాల్లో పరభాషా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువ. కానీ, తెలుగు నుంచి పరభాషల్లోకి వెళ్లిన క్యారెక్టర్ ఆర్టిస్టు మాత్రం కోట శ్రీనివాసరావు మాత్రమే. హిందీలో అమితాబ్ తో ‘సర్కార్’లో కోటనే కావాలని ఆర్జీవీ పట్టుబట్టి నటించేలా చేశారు. కోట కాల్షీట్లు లేకపోతే ఆయన కోసం షూటింగ్ పోస్ట్ పోన్ చేసి మరీ నటింపజేశారు ఆర్జీవి. తనదైన నటనతో సెల్వన్ మణిగా, హిందీ డైలాగులతో ఒదిగిపోయారు. తమిళంలో సామి, కో, మలయాళంలో ది ట్రెయిన్, కన్నడలో లవ్, నమ్మ బసవ తదితర సినిమాల్లో నటించారు. తెలుగులో ‘ప్రతిఘటన’లో మంత్రి కాశియ్యగా తెలంగాణ యాసలో డైలాగులతో విలనిజంకు కొత్త అర్ధం చెప్పారు. అదే ఏడాది వచ్చిన ‘అహనా.. పెళ్లంట’తో తన కామెడీ యాంగిల్ కూడా చూపించారు. జంధ్యాల, ఈవీవీ, ఆర్జీవి, ఎస్వీ కృష్ణారెడ్డి.. కోటలో కామెడీ యాంగిల్ ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించారు.

‘ఆమె’లో ఆయన పిసినారి కామెడీతోపాటు విలనిజం, జంబలకిడిపంబ, మనీ, కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, చిత్రం భళారే విచిత్రం, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. ఎన్నో సినిమాల్లో కామెడీ చేసిన కోట ‘ఇడియట్’, ‘ఆడువారి మాటలకు అర్ధాలే వేరు’లో మధ్యతరగతి తండ్రి, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’లో తాతగానూ నటించారు. 2010.. ఆయన జీవితంలో చేదు జ్ఞాపకం. కుమారుడు బైక్ ప్రమాదంలో మరణించడం ఆయన్ను తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. జంట కామెడీ నటుడు బాబూమోహన్ కుమారుడు కూడా బైక్ ప్రమాదంలో మరణించడం యాధృచ్చికం. ‘తెలుగు నటులకు కొదవలేదు. తెలుగు నటులకు అవకాశాలివ్వాల’ని ఘంటాపధంగా చెప్పేవారు కోట. తెలుగు భాష ప్రాముఖ్యానికి ఆయనెంతో విలువనిచ్చేవారు. ఇంతటి విలక్షణ నటుడి మృతి తెలుగు పరిశ్రమ, ప్రేక్షకులకి తీరని లోటు.

సినిమా

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

రాజకీయం

తిరుమల లడ్డూ వివాదం: ట్వీట్ ద్వారా స్పందించిన అచ్చెన్నాయుడు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ట్వీట్ ద్వారా స్పందించారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నానని, వేంకటేశ్వర స్వామిపై తనకు ఉన్న...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎక్కువ చదివినవి

తిరుమల లడ్డూ వివాదం: ట్వీట్ ద్వారా స్పందించిన అచ్చెన్నాయుడు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ట్వీట్ ద్వారా స్పందించారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నానని, వేంకటేశ్వర స్వామిపై తనకు ఉన్న...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

Daily Horoscope: మేష, ధనుస్సు రాశుల వారికి ఉద్యోగ పురోగతి – ఆర్థిక లాభాల సూచనలు

మార్చి 6, 2026 శుక్రవారం రాశిఫలాలు మేషం (Aries): ఈరోజు మీ పనుల్లో మంచి చురుకుదనం కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ కృషికి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరించే పరిస్థితి రావచ్చు....

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు: మండలిలో లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా...

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.. నాగచైతన్య హీరోగా నటించిన ‘వృషకర్మ’ ఫస్ట్...