Switch to English

కరోనాతో సహజీవనం ఎలా చెయ్యాలంటే.!

‘లాక్‌డౌన్‌’తో కరోనా వైరస్‌ని దేశం నుంచి తరిమేద్దామంటూ గొప్ప గొప్ప ‘పలుకులు’ పలికిన పాలకులు ఇప్పుడు చేతులెత్తేశారు. ‘కరోనా వైరస్‌తో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలి..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అది కరీనా కపూర్‌ కాదు సామీ.. కరోనా వైరస్‌.. ప్రమాదకరమైన వైరస్‌తో సహజీవనమేంటి.? అంటూ జనం నెత్తీ నోరూ బాదుకుంటున్నా.. తప్పదు, సహజీవనం చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు తెగేసి చెబుతున్నారు.

ఏం చేస్తాం, పాలకులు ఎలా చెబితే అలా చేయాల్సిందే. ఇంతకీ, భవిష్యత్‌ ఎలా వుండబోతోంది.? కరోనా వైరస్‌తో సహజీవనం చేయడం ఎలా.? అసలంటూ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలే లేవంటూ పరిశోధకులు తేల్చి చెబుతున్న వేళ, కరోనా వైరస్‌ని భరించడమెలాగో అర్థం కావడంలేదు సామాన్యులకి. మాస్క్‌ని మన జీవితంలో ఓ భాగం చేసుకోవాలి ఇకపై.. కానీ, ఇదొక్కటే కరోనా వైరస్‌ని దూరంగా వుంచుతుందా.? అంటే సమాధానం దొరకని పరిస్థితి.

శానిటైజర్లు వాడాలి.. ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించాలి. అవన్నీ జరిగే పనులేనా.? అనడగొద్దు. పాలకులు చెబుతున్నారు.. మనం పాటించాల్సిందే. దేనికీ గ్యారంటీ లేదు.. కానీ, అన్నీ పాటించాలి.. ఇదే మరి ‘ఖర్మ’ అంటే. కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తేనే, ఇప్పుడు కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 82 వేలకు చేరుకుంది. లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులు ఇచ్చేశాక.. అది ఎన్ని లక్షలకు చేరుకుంటుందో, ఎన్ని వేల మరణాలు చోటు చేసుకుంటాయో చెప్పలేని పరిస్థితి.

ప్రపంచ దేశాలకు పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగామంటూ కేంద్రం చెబుతున్న గొప్పలకీ.. దేశంలో పరిస్థితులకీ స్పష్టమైన తేడా వుంది. ప్రపంచ దేశాలతో పోల్చితే, బారతదేశంలోనూ ఆర్థిక వ్యవస్థ అనూహ్యమైన రీతిలో కుప్పకూలిపోయింది. అభివృద్ధి చెందుతున్న మన దేశం ఈ కరోనా వైరస్‌ నుంచి కోలుకోవడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ తరుణంలో ‘ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌’ అంటూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించి, ‘కండిషన్స్‌ అప్లయ్‌’ అంటోంది కేంద్రం.

కేంద్రం తీరు అలా వుంటే, రాష్ట్రాలూ ఇందుకు భిన్నంగా ఏమీ వ్యవహరించడంలేదు. ఖజనా నింపుకోవడానికి మద్యం దుకాణాల్ని తెరిచారు.. మద్యం రేట్లు మాత్రమే కాదు.. అన్ని రేట్లూ పెంచుకుంటూ పోతున్నాయి ప్రభుత్వాలు. అసలే, రెండు నెలలుగా లాక్‌డౌన్‌ దెబ్బకి జేబులు ఖాళీ అయిపోయిన బడుగు జీవులు, ఈ పెరిగిన ధరలతో ‘చావే శరణ్యం’ అనే స్థితికి వచ్చేస్తున్నారు. సహజీవనం సంగతి దేవుడెరుగు.. అసలంటూ ప్రాణాలతో వుండాలి కదా.? అని ఆర్థిక సమస్యల్ని ఏకరువు పెడుతున్న దేశ ప్రజానీకానికి ఏం సమాధానమిస్తారు పాలకులు.?

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

వైఎస్‌ జగన్‌తో చిరంజీవి భేటీ.. అతి త్వరలో.!

మెగాస్టార్‌ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ కాబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై వైఎస్‌ జగన్‌తో చిరంజీవి ఈ బేటీలో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా...

జగన్‌ సర్కార్‌కి ఝలక్‌: డాక్టర్‌ సుధాకర్‌ కేసు సీబీఐకి.!

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మత్తు డాక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల్లో మద్యంతర నివేదిక అందించాలని ఈ...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

ఆగస్టులో వచ్చే సినిమాలు ఏంటి?

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్‌కు అనుమతిస్తూ మెల్ల మెల్లగా లాక్‌ డౌన్‌ను సఢలిస్తున్న విషయం తెల్సిందే. ఆగస్టు నుండి పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్‌ అయ్యే అవకాశం ఉందని.. అయితే సామాజిక దూరం...

బాహుబలి నిర్మాతలు కూడా ఆ రూట్లోనే వెళుతున్నారు

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా థియేటర్లు అన్నీ మూసివేశారు. గత 70 రోజుల నుండి థియేటర్లు తెరుచుకోవట్లేదు. ఇది మరికొంత కాలం కొనసాగే అవకాశముంది. థియేటర్లు త్వరలో తెరుచుకున్నా కానీ ప్రేక్షకులు ఎంత...