VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) – లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లిసందడి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల స్నహాన్ని మూడుముళ్లుతో వివాహ బంధంగా మార్చుకున్నారు. ఇటలీ (Italy) లో మూడు రోజులపాటు ఘనంగా వీరి వివాహం జరిగింది. హైదరాబాద్ లో కూడా రిసెప్షెన్ సినీ ప్రముఖుల మధ్య అట్టహాసంగా జరిగింది.
ఈ సందడిని, భర్త వరుణ్ గురంచి మెగా ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా పలు పొటోలు షేర్ చేస్తూ పంచుకుంది. ‘వరుణ్ గొప్పదనం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అతని కేర్, నాపై ప్రేమ, నాకు ఇచ్చే విలువ గురించి చాలా చెప్పాలని ఉంది. కానీ.. ఆ అనుభూతులను మా మధ్యే ఉంచుకోవాలని అనుకుంటున్నా. మమ్మల్ని ఆశీర్వదించిన వారందరికీ ధన్యవాదాల’ని రాసుకుంది.
ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను లావణ్య తన ఇన్ స్టా అకౌంట్ లో పంచుకుంది. తన కుటుంబం, మెగా కుటుంబం, బంధువులు, పెళ్లి దుస్తుల్లో వరుణ్-లావణ్య ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.
View this post on Instagram