మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా లైలా. షైన్ స్క్రీ బ్యానర్ లో సాహు గారపాటి ఈ సినిమా నిర్మించారు. ఆకాంక్ష శర్మ హిరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అలరించాయి. ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు విశ్వక్ సేన్.
యాక్టర్ గా కొన్ని ప్రత్యేకమైన పాత్రలు చేయాలని ప్రతి నటుడికి ఉంటుంది.. లైలా విషయంలో నేను కూడా అలానే ఆలోచించా.. భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో సినిమాలు చూసినప్పుడు ఇలాంటి గెటప్ వేయాలని ఉండేది.. ఆడియన్స్ కొత్త కథలను, థీమ్స్ ని కోరుకుంటారు..ఇలాంటి సినిమాలు రాక దాదాపు రెండు దశాబ్ధాలు అవుతుంది. కథ కూడా సెట్ అవ్వడంతో లైలా సినిమా చేశానన్నారు విశ్వక్ సేన్.
లైలా సినిమాలో సోను కన్నా లైలా క్యారెక్టర్ నాకు ఇష్టమన్నారు విశ్వక్ సేన్. స్క్రీన్ మీద సోను క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ సోను మోడల్.. సెకండ్ హాఫ్ లైలా అలరిస్తారని అన్నారు విశ్వక్ సేన్.
సోను లైలాగా మారడానికి మూడు సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయటపడటానికి లైలాగా మారతాడు. అదేంటి అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాలని అన్నారు విశ్వక్. లైలాగా మారేందుకు రెండున్నర గంటల టైం పట్టేది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మేకప్ చేశారు. అందుకే అది అంత న్యాచురల్ గా వచ్చిందని అన్నారు విశ్వక్ సేన్.
లైలా ఒక యూత్ ఫుల్ కంటెంట్.. అవుట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ తో వస్తుంది. కథ విన్నప్పుడే బాగా ఎంజాయ్ చేశా.. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు సీరియస్ గా విన్నా ఈ కథ మాత్రం విన్నప్పుడే ఎంజాయ్ చేశానన్నారు విశ్వక్ సేన్.
కాంపౌండ్ కామెంట్ చిరంజీవి గారు ప్రస్తావించడం భలే అనిపించింది. చిరంజీవి గారు అది ప్రస్తావించడం ఆనందంగా అనిపించింది. అందరం అందరినీ సపోర్ట్ చేసుకోవాలి.. ఫైనల్ గా ఆడియన్స్ కు మంచి సినిమాలు ఇవ్వాలి. సినిమా మీద ప్రేమ తోనే అందరం ప్రయాణిస్తున్నామని అన్నారు విశ్వక్ సేన్.
నిర్మాత సాహు గారు సినిమా క్రాఫ్ట్స్ తెలిసిన ప్రొడ్యూసర్. ఈ సినిమా నేను చేయగలనని ముందు ఆయన నమ్మారు. ఫ్యూచర్ లో కూడా ఆయనతో సినిమాలు చేస్తానన్నారు విశ్వక్ సేన్. చిరంజీవి గారు స్టేజ్ మీద నాకే కొరకాలనిపిస్తుందని చెప్పడం బెస్ట్ కాంప్లిమెంట్. లైలా నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు విశ్వక్ సేన్.