మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ లైలా సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతుంది. రామ్ నారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కూడా కనిపించనున్నాడు. లైలా ట్రైలర్ చూశాక దాదాపు కథ ఏంటన్నది తెలిసిపోయింది. విశ్వక్ సేన్ లేడీ గెటప్ అదే లైలాగా ఎలా అలరించాడు అన్నదే తెలియాల్సి ఉంది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో ప్లాన్ చేస్తున్నారు.
విశ్వక్ సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగా బాస్ మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ ని ఆహ్వానించడానికి బాస్ ఇంటికి వెళ్లారు హీరో విశ్వక్ సేన్ ఇంకా సినిమా నిర్మాత సాహు గారపాటి. రీసెంట్ ప్రెస్ మీట్ లో లైలా ఈవెంట్ కి బాస్ వస్తున్నాడని ప్రకటించినా కూడా మెగాస్టార్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం పలకాలని లైలా హీరో, నిర్మాత అనుకున్నారు.
విశ్వక్ సేన్ లైలా ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి రావడం కన్ఫర్మ్ అయ్యింది. ఐతే ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ అన్నది ఇంకా నిర్ణయించలేదు. మెగా బాస్ మాస్ కా దాస్ ఈవెంట్ కి వస్తే ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది. లైలా ప్రచార చిత్రాలన్నీ కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమాతో విశ్వక్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి.