Sanjay dutt: సినిమా నటులపై అభిమానం ఏస్థాయిలో ఉంటుందో నిరూపించారు ముంబైకి చెందిన నిషా పటేల్. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే ఆమెకు ఎంతో అభిమానం. 62ఏళ్ల వయసులో ఆమె ఇటివలే మరణించారు. అయితే.. 2018లోనే.. తాను చనిపోయాక తన ఆస్తి రూ.72కోట్లు సంజయ్ దత్ కు చెందేలా బ్యాంక్.. లీగల్ పత్రాలు సిద్ధం చేశారు.
కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో నిషా పటేల్ మృతి చెందారు. దీంతో బ్యాంకు అధికారులు విషయాన్ని సంజయ్ దత్ కు చేరవేశారు. దీంతో ఆశ్చర్యపోవడం సంజూ వంతైంది. ఆమె ఎవరో నాకు తెలీదని.. ఆస్తి తీసుకునేందుకు నిరాకరించారు. పైగా.. ఆస్తి వారి కుటుంబసభ్యులకు అందేలా లీగల్ టీమ్ ఏర్పాటు చేశారు.
కానీ.. నిషా పటేల్ అభిమానానికి సంజయ్ దత్ చలించిపోయారు. అంతటి అభిమానిని కలుసుకోలేక పోయినందుకు చింతించారు. ఆమె కుటుంబసభ్యులనైనా కలుసుకుంటానని పేర్కొన్నారు. సంజయ్ దత్ బాలీవుడ్ ప్రేక్షకులకే కాదు.. టాలీవుడ్ ప్రేక్షకులకీ సుపరిచితులే. కేజీఎఫ్-2, లియో, డబుల్ ఇస్మార్ట్ సినిమాల్లో నటించారు.