నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం “మ్యాడ్” ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకి ఇప్పుడు కొనసాగింపుగా “మ్యాడ్ స్క్వేర్” తెరకెక్కుతోంది. మొదటి భాగానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్ర ప్రచారాన్ని ఘనంగా మొదలుపెట్టింది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ప్రచారంలో భాగంగా “లడ్డు గాని పెళ్లి” అనే పార్టీ సాంగ్ ని మూవీ టీం విడుదల చేసింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించి.. మంగ్లీ తో కలిసి ఈ పాటను ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జానపదం ఆధారంగా వినోదాత్మకంగా ఈ పాటను రూపొందించారు. ఇందులో ముగ్గురు హీరోల స్టెప్పులు హైలైట్ గా నిలిచాయి.
“మ్యాడ్ స్క్వేర్” సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలయికలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇతర తారాగణం వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.