Laapataa Ladies: ధియేటర్లో మిశ్రమ స్పందనకే పరిమితమై.. ఓటీటీలో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సినిమా ‘లాపతా లేడీస్’. అమీర్ ఖాన్ నిర్మాణంలో కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ, ఎమోషనల్ డ్రామా మూవీపై దేశవ్యాప్తంగా చర్చతోపాటు ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది.
సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75ఏళ్లయిన సందర్భంగా ‘లాపతా లేడీస్’ను సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేటివ్ భవనంలో సి-బ్లాక్ లో నేటి (శుక్రవారం) సాయంత్రం 4.15గంటలకు ప్రదర్శించనున్నట్టు సర్క్యులర్ విడుదల చేశారు. ప్రదర్శనకు సుప్రీంకోర్టు సీజేఐ చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు, కుటుంబసభ్యులు అమీర్ ఖాన్, కిరణ్ రావ్ కూడా హాజరవుతున్నట్టు పేర్కొన్నారు.
దీంతో మరోసారి ‘లాపతా లేడీస్’ వార్తల్లో నిలిచింది. 2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుని అనుకోకుండా రైలు నుంచి విడిపోతారు. సమాజంలో జరగుతున్న అనేక సంఘర్షణలను పాత్రల్లో చూపించి చివరికి తమ కల నెవరేర్చుకునే యువతి.. కుటుంబంలో కలిసే మరో యువతి పాత్రలను తీర్చిదిద్దన తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.