కుబేర మూవీని అందరూ ఎంజాయ్ చేస్తారు.. నాగార్జున, ధనుష్‌ కామెంట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,387FansLike
57,764FollowersFollow

కుబేర మూవీ చాలా స్పెషల్ గా ఉంటుందని.. అందరూ ఎంజాయ్ చేస్తారని హీరోలు నాగార్జున, ధనుష్‌ అన్నారు. ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. జూన్ 20న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీలోని ‘పీ పీ డుమ్‌ డుమ్‌’ పాటని ముంబయిలో గ్రాండ్ గా లాంచ్ చేశారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో ధనుష్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు చేయని పాత్రను ఈ మూవీలో చేశాను. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ సినిమాను మేం ఛాలెంజింగ్ గా చేశాం అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. మేం చాలా సరదాగా చేసేశాం. ఇందులో నేను బెగ్గర్ పాత్ర చేశాను. దాని కోసం పెద్దగా రీసెర్చ్ చేయలేదు. శేఖర్ గారు ఎలా చెప్తే అలా చేసేశాను. ఆయన చాలా మంచి వ్యక్తి. అందరితో మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తారు. నాగార్జున గారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను రష్మిక ఓ డంప్‌యార్డ్‌లో దాదాపు 7 గంటలపాటు షూటింగ్‌లో పాల్గొన్నాం. అంత సేపు ఉన్నా అక్కడ ఆమెకు ఎలాంటి వాసన రాలేదని చెప్పింది. ఆమెకు ఏమైందో నాకు తెలియదు (నవ్వుతూ). ఈ మూవీతో నాకు ఎన్నో అనుబంధాలు ఏర్పడ్డాయి. మంచి వారితో పరిచయాలు పెరిగాయి. మూవీ అందరికీ నచ్చుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

‘హీరో నాగార్జున మాట్లాడుతూ.. ‘ముంబైతో నాకు మంచి అనుబంధం ఉంది. శివ, క్రిమినల్ మూవీల నుంచే నన్ను ఇక్కడి వాళ్లు ఆదరిస్తున్నారు. కుబేర సినిమా నాకు చాలా స్పెషల్. శేఖర్ కమ్ముల గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని 15 ఏళ్లుగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. ఆయన మనసు చాలా ప్యూర్ గా ఉంటుంది. అందరితో కలిసిపోతారు. కరెక్ట్ టైమ్ లో నా దగ్గరకు వచ్చి కథ చెప్పారు. వెంటనే ఓకే చేశాను. మూవీ చాలా బాగా నచ్చింది నాకు. జిమ్ సర్బ్ తో కలిసి పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్. తెలుగు చాలా చక్కగా మాట్లాడారు. రష్మిక పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్. ఆమె చేసిన మూవీలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ధనుష్ అద్భుతమైన నటుడు. ఈ మూవీలో చాలా బాగా నటించాడు. అతనిలో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. మూవీని అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పాడు.

హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. ‘నేను చేసిన స్పెషల్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. శేఖర్ గారితో పనిచేయడం చాలా మంచి అనుభవం నేర్పించింది. నా క్యారెక్టర్ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. నాకు పర్ఫార్మెన్స్ చేయడానికి మంచి పాత్ర దొరికింది. నాగార్జున సర్, ధనుష్‌ గారితో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ఇప్పుడు కుదిరింది. ఈ కుబేరలో చేసిన రోల్ ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది’ అంటూ చెప్పారు.

సినిమా

Chiranjeevi: ‘చిరంజీవిగారిని కలిసింది అందుకే..’ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన డైరక్టర్

Chiranjeevi: సినిమాల్లో కొత్తవారిని ప్రోత్సహించడం, నటీనటుల నటనను మెచ్చుకోవడం, టెక్నీషియన్ల ప్రతిభను కొనియాడటం మెగాస్టార్ చిరంజీవికి మొదటి నుంచీ ఉన్న అలవాటు. ఎందరో నటీనటులు, దర్శకులు...

గుర్రపు స్వారీలో విజయ్ దేవరకొండ కష్టాలు.. ‘రణబాలి’ బర్త్ డే గ్లింప్స్...

విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “రణబాలి” నుంచి విడుదలైన బర్త్ డే స్పెషల్ మేకింగ్ గ్లింప్స్...

“కృష్ణ” రీ-రిలీజ్‌కు షాక్.. బుకింగ్స్ లేక విడుదలే రద్దు!

మాస్ మహారాజా Ravi Teja కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో Krishna ఒకటి. వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2008లో...

ట్రెండీ కామెడీతో రాబోతున్న రాజేంద్రప్రసాద్ “పాంచాలి పంచభర్తృక”

తెలుగు ప్రేక్షకులను మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు నటకిరీటి Rajendra Prasad ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ Panchali Panchabharthrika విడుదలకు సిద్ధమవుతోంది. రాయల్...

యువ ప్రేక్షకుల బంగారు కొండ.. ఈ విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: సాధారణ యువకుడు.. సినీరంగంలో రాణించాలని వచ్చాడు. తన ఫోటోలతో స్టూడియోలకు వెళ్ళాడు. ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఫోటోలు ఇచ్చాడు. మొత్తంగా వెండితెరపై కనిపించాడు....

రాజకీయం

“హలో ఇండియా!” పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu...

ఒమాన్‌లో చిక్కుకున్న షానవాజ్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చిన జనసేనాని!

“ఒక వీడియో చూసి వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్”.. అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన శ్రీమతి షానవాజ్ కొన్ని రోజుల క్రితం ఒమాన్‌లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల గురించి భావోద్వేగ వీడియో ద్వారా సహాయం...

మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

వ్యవసాయ రంగాన్ని సాంకేతికతతో మరింత ఆధునికంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేయనుంది. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం, స్మార్ట్ టెక్నాలజీల అభివృద్ధి లక్ష్యంగా అన్నమయ్య జిల్లా...

“ఫైళ్లు కాదు… ఫలితాలు కదలాలి”: కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టమైన సందేశం

రాష్ట్ర పరిపాలనలో వేగం, ప్రజల సంతృప్తి, క్షేత్రస్థాయి ఫలితాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అధికార యంత్రాంగం...

మళ్లీ ట్విస్ట్: విజయ్‌కు గవర్నర్ షాక్… కానీ ఆశ మాత్రం మిగిలే ఉంది!

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ మరియు ఆయన నేతృత్వంలోని TVK పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై మరో కీలక మలుపు తిరిగింది. తొలుత ప్రభుత్వ...

ఎక్కువ చదివినవి

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని Mythri Movie Makers,...

“హలో ఇండియా!” పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu...

నెల్లూరులో కలెక్టర్ హిమాన్షు శుక్లా స్టైల్ పాలన.. వినూత్న కార్యక్రమాలతో వేగం

నెల్లూరు జిల్లాలో పాలనకు కొత్త దిశనిస్తూ జిల్లా కలెక్టర్ Himanshu Shukla తనదైన ముద్ర వేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించి ఎనిమిది నెలలు పూర్తవుతున్న వేళ, వినూత్న కార్యక్రమాలు, సమర్థవంతమైన అమలు, ప్రజలతో ప్రత్యక్ష...

గిరిజన విద్యలో చంద్రబాబు సంస్కరణలు… అక్షరాస్యత పెరుగుదలకు కీలక మలుపు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గురించి ఉన్నత వర్గాలకే ప్రాధాన్యం ఇస్తారనే అభిప్రాయం తరచూ వినిపిస్తుంటుంది. అయితే 1995 నుంచి 2003 వరకు ఆయన పాలనలో గిరిజన విద్యపై తీసుకున్న చర్యలు...