కొన్ని రోజులు వెనక్కు వెళ్తే ఆ సమయంలో టాలీవుడ్ టాప్ స్టార్ నిర్మాతల జాబితా తీస్తే కేఎస్ రామారావు పేరు ముందు వరుసలో ఉండేది. ఈయన ఎన్నో మంచి సినిమాలు నిర్మించి అభిరుచి కలిగిన నిర్మాత అంటూ పేరు దక్కించుకున్నాడు. అలాంటి కేఎస్ రామారావు నిర్మించిన బ్లాక్ బస్టర్ లతో దాదాపుగా 400 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించాడని సమాచారం. అంతటి ఆస్తులు సంపాదించిన ఆయన సినిమాలపై మోజో లేదంటే పిచ్చో తెలియదు కాని వరుసగా సినిమాలు నిర్మిస్తూనే ఉన్నాడు. తాను సంపాదించిన డబ్బు అంతా కూడా పోతూ ఉన్నా కూడా సినిమాలను మాత్రం వదల్లేదు.
తేజ్ ఐ లవ్ యూ, కౌసల్య కృష్ణమూర్తి ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా వరుసగా చిత్రాలు నిర్మిస్తూనే ఉన్నా ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఈయనకు సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు. ఫ్లాప్ మీద ఫ్లాప్‌లు వస్తూనే ఉన్నాయి. హీరోల పారితోషికాలు మరియు టెక్నీషియన్స్ పారితోషికాలు అస్సలు ఆపకుండా ఇచ్చేసే రామారావు గతంలో పలు సందర్బాల్లో డబ్బు లేకపోవడంతో పారితోషికాలుగా తన ఆస్తులను ఇచ్చిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఒక హీరోకు తన లగ్జరీ కారును బ్యాలన్స్ పారితోషికం కింద ఇచ్చాడని వార్తలు వచ్చాయి.
ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండకు వరల్డ్ ఫేమస్ లవర్ పారితోషికంగా ఆస్తినే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఫైనాన్సియర్స్‌కు కోట్ల విలువ చేసే భవనాలను ఇచ్చాడు. ఇలా ఆయన చాలా నష్టపోతూ వచ్చాడు. చేతిలో డబ్బు లేకున్నా కూడా వరుసగా చిత్రాలు నిర్మించడంతో ఆస్తులను కూడా అమ్మేసుకోవాల్సి వచ్చిందట. ప్రస్తుతం కేఎస్ రామారావు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో మాదాపూర్‌లోని ఒక ఇంట్లో అద్దెకు ఉండాల్సిన పరిస్థితి.
కేఎస్ రామారావు ఇప్పటికైనా సినిమాలను ఆపకుంటే ఆయన ఇంకా నష్టపోతాడంటూ సన్నిహితులు చెబుతున్నారు. కాని ఆయన మాత్రం సినిమా అంటే పిచ్చితో కొత్త సినిమా కోసం చర్చలు జరుపుతూనే ఉన్నాడట. 400 కోట్ల వరకు నష్టపోయినా కూడా ఆయన సినిమాను చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు అంటే ఆయనకు సినిమా అంటే ఫ్యాషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే సినిమా అంటే ఫ్యాషన్ ఉంది బాగానే ఉంది కాని మంచి సినిమాలను ఎంపిక చేసుకుని నిర్మించడంలో మాత్రం ఆయన విఫలం అవుతున్నాడు. గతంలో మంచి నిర్మాతగా పేరు దక్కించుకున్న ఆయన కాలంకు తగ్గట్లుగా మారి సినిమాలు అందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆ కారణంగానే ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
150260 444251Was koche ich heute – diese Frage stellen sich tag fuer tag viele Menschen. Und wir haben tag fuer tag die perfeckte Antwort darauf! Besuchen Sie uns auf unserer Webseite und lassen Sie sich von uns beraten . Wir freuen uns auf Sie! 233617
606599 166881Strategies for dilution antimicrobial susceptibility beadlets for beagles that grow aerobically-fifth edition. 426705
299749 295481Sounds like some thing a lot of baby boomers should study. The feelings of neglect are there in numerous levels when a single is over the hill. 456084