Switch to English

ఫ్యామిలీస్ థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: కృతి శెట్టి

నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతిశెట్టి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

టాలీవుడ్ లో బిజీగా సినిమాలు…
నాలోని ప్రతిభని గుర్తించి అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాత లకు కృతజ్ఞతలు చెబుతున్నాను. వరుస సినిమాలు చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను.

సరైన కథలు ఎంచుకుంటున్నారా…
నేను వచ్చి ఏడాదే అవుతుంది. ఎప్పుడు షూటింగ్ కి వెళ్దామా అనిపిస్తుంటుంది. కథ విన్నప్పుడే ఒక నమ్మకం వస్తుంది. సినిమా ప్రేక్షకులకు వినోదం పంచుతుందనిపిస్తుంది. ఫలితంపై నాకు ఎలాంటి రిగ్రేట్ వుండదు. ఏదైనా లెర్నింగ్ ఎక్స్ పిరియన్స్ గానే తీసుకుంటాను.

‘మాచర్ల నియోజకవర్గం’లో పాత్ర….
‘మాచర్ల నియోజకవర్గం’లో నా పాత్ర పేరు స్వాతి. సింపుల్ అండ్ ఇన్నోసెంట్. సీన్ ని బట్టి ఒక్కో షేడ్ బయటికి వస్తుంది. నా పాత్ర చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది.

మాచర్ల నియోజక వర్గం కథ..
కథ గురించి అప్పుడే ఎక్కువ చెప్పకూడదు గానీ.. నేను విన్న వెంటనే ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది. పొలిటికల్ టచ్ తో పాటు మంచి సాంగ్స్, కామెడీ, యాక్షన్ అన్నీ మంచి ప్యాకేజీగా వుంటుంది. ఈ చిత్రం ఒక లాంగ్ వీకెండ్ లోవస్తోంది. ఫ్యామిలీస్ అంతా థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేస్తారు.

నితిన్ గారితో పని చేయడం…
నితిన్ గారు నాకు మంచి స్నేహితులయ్యారు. ఆయనలో అందమైన అమాయకత్వం కూడా వుంది. ఇరవై ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రీలో వున్నారు. జయం సినిమాలో ఎలా వున్నారో.. ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఆయన అంతే ఫ్రెష్ గా వున్నారు.

మాచర్లలో షూటింగ్ అనుభవం
మాచర్ల సెట్ కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ గారు చాలా మంది నటీనటులు వున్నారు. అందరికంటే నేనే చిన్నదాన్ని. వారు మాట్లాడే విధానంలో నాపై చాలా ప్రేమ వుందని అర్ధమౌతుంటుంది.

దర్శకుడు రాజశేఖర్ రెడ్డి…
రాజశేఖర్ గారు చాలా కూల్ పర్శన్. ఎప్పుడూ కోపం రాదు. చిరాకు పడరు. సీన్ చెప్పడానికి చాలా ఎక్సయిట్ అవుతుంటారు. ఆయనతో వర్క్ చేయడం మంచి ఎక్స్ పిరియన్స్. నాతో మరో సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతుంటాను.

ఉప్పెన తర్వాత మళ్ళీ….
ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనీ వుంటుంది. ఉప్పెన తర్వాత బ్యాలెన్స్ చేసుకొని ప్రాజెక్ట్స్ సైన్ చేశాను. అయితే వరుసగా కమర్షియల్ సినిమాలు విడుదలౌతున్నాయి.

ఉప్పెనలో చాలా సాంప్రదాయంగా…
ఉప్పెనలో నా పాత్ర ప్రేక్షకులకు నచ్చడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా పాత్రని ఎంతగానో రిలేట్ చేసుకున్నారు. అందుకే ఉప్పెన తర్వాత వెంటనే శ్యామ్ సింగరాయ్ లో పూర్తిగా భిన్నంగా వుండే పాత్ర చేశాను.

లేడీ ఓరియంటెడ్ సినిమాలు…
ఇప్పటికి ఆ ఆలోచన లేదు. అది చాలా భాద్యతతో కూడుకున్న అంశం. దర్శక నిర్మాతలు బలమైన నమ్మకం కలిగించినపుడు దాని గురించి ఆలోచిస్తాను.

బాలీవుడ్ అవకాశాలు…
హిందీ అవకాశాలు వచ్చాయి. కానీ చేసే ఆలోచన లేదు. తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో మంచి ఆదరణ లభిస్తోంది.

సినిమాలు కాకుండా వేరే లక్ష్యాలు…
నాకు చిన్నప్పటి నుండి ఎన్జీవో స్టార్ట్ చేయాలనీ వుండేది. త్వరలోనే మొదలుపెడతానని అనుకుంటున్నాను.

ఫ్రెండ్ షిప్ డే ప్లాన్స్…
ముంబైలో వున్నప్పుడు ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ కట్టుకునేవాళ్ళం. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అమ్మే.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి…
సూర్య గారితో ఒక సినిమా. అలాగే నాగచైతన్యతో మరో సినిమా. ఇంద్రగంటి గారి సినిమా. ఇంకొన్ని కథలు చర్చల్లో వున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

USAలో ‘కార్తికేయ-2’ గ్రాండ్ 50 రోజుల వేడుకలు.

నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి...

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

ఎదురు చూపులకు తెర.. ‘ఆదిపురుష్’ వచ్చేశాడు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 2వ తారీఖున ఈ సినిమా ఒక్క టీజర్...

రాశి ఫలాలు: ఆదివారం 25 సెప్టెంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు భ్రాథ్రపదమాసం సూర్యోదయం: ఉ.5:52 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: భాద్రపద బహుళ అమావాస్య రా.3:17 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము: ఉత్తర పూర్తి యోగం: శుభం ఉ.10:49...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సరస్వతి దేవిని అర్చించారు....

ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షునిగా ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఎన్నిక.

హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఎన్నికలు హోరా హోరీగా జరిగాయి. అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, సురేష్ బాబు మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రెసిడెంట్ గా...

అభిమానులు తడుస్తున్నారని.. తానూ వర్షంలో తడిసిన మెగాస్టార్..

ఆసక్తి గా సాగుతోన్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీస్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడటానికి ముందు వర్షం ప్రారంభమైంది. వెంటనే చిరు ను మాట్లాడమని స్టేజి మీదకు పిలిచారు. చిరంజీవి మాట్లాడుతూ తను...