Switch to English

జగన్‌ ప్రభుత్వ వైఫల్యానికి ‘కోయంబేడు’ పూత.!

తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కి వెళ్ళి వచ్చినవారి ద్వారా మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడుని ఆనుకుని వుండే చిత్తూరు జిల్లాతోపాటు, తమిళనాడుకి దూరంగా వుండే తూర్పుగోదావరి జిల్లాలోనూ ‘కోయంబేడు’ లింకులతో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయమే. ఈ కేసుల గురించి ప్రత్యేకంగా బులెటిన్‌లో ప్రస్తావిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ.

నిజానికి, భారతదేశానికి విదేశాల నుంచి పెద్దగా కరోనా ముప్పు సంభవించలేదు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ కారణంగానే పెను ముప్పు వాటిల్లింది. మర్కజ్‌ వ్యవహారం వేరు.. కోయంబేడు మార్కెట్‌ వ్యవహారం వేరు. లాక్‌డౌన్‌ పూర్తిగా అమలవుతున్న సమయంలో కోయంబేడు వ్యవహారం తెరపైకొచ్చింది. అంటే, ఇది పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యమే.

సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టామని చెబుతూనే, పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాలను ఎందుకు సమర్థవంతంగా తనిఖీలు చేయలేకపోయారు.? వాటి డ్రైవర్లను ఎందుకు ట్రాక్‌ చేయలేకపోయారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఏమీ కాదు. తమ వైఫల్యానికి ‘ముసుగు’ తొడుగుతూ, దాన్ని కోయంబేడు ఖాతాలో పడేస్తోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌.

కోయంబేడు లింకుల కారణంగా వెలుగు చూసిన కేసులు అక్కడితో ఆగితే మంచిదే. కానీ, అవి మళ్ళీ సామూహిక వ్యాప్తికి దారి తీస్తే.. ముందు ముందు పెను ప్రమాదం తప్పదు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ షాపుల్ని తెరిచాక, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున మందుబాబులు ఆంధ్రప్రదేశ్‌ బోర్డర్‌లో హల్‌చల్‌ చేశారు. వాటికి సంబంధించి కొత్త కేసులు ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో నమోదయ్యాయా.? అన్న విషయమై సరైన స్పష్టత లేదు.

ఫ్లాష్ న్యూస్: టీవీ5పై దాడి చేసిన వారిని శిక్షించాలి – పవన్ కళ్యాణ్

ఇదిలా వుంటే, ప్రజా రవాణాకి వెసులుబాట్లు రానున్న దరిమిలా.. ఇకపై, కరోనా వ్యాప్తి విషయమై ఎవర్నీ నిందించడానికి వీల్లేని పరిస్థితి దాపురిస్తుందేమో. తప్పదు, అప్పుడిక కరోనాతో సహజీవనం చేయాల్సిందే ఎవరైనా .!

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

వైసీపీ పైత్యం: హైకోర్టుకీ దురుద్దేశాలు ఆపాదిస్తారా.?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో 60 సార్లకు పైగా న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరిపాలన అన్నాక ఇలాంటివి సహజమే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు న్యాయస్థానాలు చీవాట్లు...

బాలీవుడ్ సూపర్ స్టార్ తో పూరి జగన్నాథ్?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. జెట్ స్పీడ్ లో...

లైవ్ విజువల్స్: బెంగాల్, ఒడిశా, విశాఖలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అంపన్ తుఫాన్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొదలైన అంపన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ భీభత్సం నేడు విశాఖ తీరం మరియు కాకినాడ తీరప్రాంతాల్లోనూ దాడి చేయడం మొదలు...

రవితేజ మూవీ క్యాన్సల్ అయ్యిందా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ మూవీ ఈ సమ్మర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ విపత్కర పరిస్థితుల్లో సినిమా షూటింగ్ ఆగిపోవడంతో సినిమా విడుదల కూడా ఆగిపోయింది. ఎప్పటికి క్రాక్...

కరోనా అలర్ట్‌: మారటోరియం.. మళ్ళీ వచ్చిందిగానీ..

కరోనా వైరస్‌ దెబ్బకి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఈ నేపథ్యంలో లోన్లు తీసుకున్నవారికి కాస్త ఉపశమనం కల్పించేలా ఆర్బీఐ గతంలోనే మూడు నెలల మారటోరియం ప్రకటించిన విషయం విదితమే. ఈ నెలాఖరుతో ఈ...