Switch to English

పవన్ కళ్యాణ్‌పై ‘కోట’ విసుర్లు.! వృద్ధాప్య చాదస్తం వల్లేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

పెద్దాయన.! ఏమీ అనలేం.! కానీ, ఆయన మాత్రం చాలా చాలా అనేస్తున్నారు. రోజులు మారాయ్.! కోట శ్రీనివాసరావుకీ ఆ విషయం తెలుసు. కాలంతోపాటు ఆయన కూడా మారారు.! అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. ఆయన ముందు తరానికీ, ఆయన తరానికీ చాలా తేడాలున్నాయ్. అలాగని, ఆయన్ని ఆయన ముందు తరం వాళ్ళు విమర్శించి వుంటే.!

రోజుకి రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు మైక్ పట్టుకుని ప్రకటించడమేంటి.? అంటూ ప్రశ్నించేశారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఓ కార్యక్రమంలో.

సన్మానాల సమయంలో సన్మాన గ్రహీతలు నాలుగు మంచి మాటలు చెప్పడం ఆనవాయితీ. మంచి మాటలైతే ఫర్లేదు, అలాంటి వేదికల్ని ఎవరి మీదనో విమర్శలు చేయడానికి వాడుకుంటేనే అభ్యంతరకరం. కోట శ్రీనివాసరావు ఎందుకీ వెకిలి వ్యాఖ్యలు చేసినట్లు.?

వృద్ధాప్యం వల్ల వచ్చిన చాదస్తంతో అనుకోవాలా.? లేదంటే, మనసులో ఏదో పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద కోట శ్రీనివాసరావు సెటైర్లు వేశారనుకోవాలా.?

తన మీద పదే పదే ‘ప్యాకేజీ’ అంటూ రాజకీయ ప్రత్యర్థులు చేస్తోన్న ఆరోపణల నేపథ్యంలో, ‘రోజుకి రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను.. అన్ని సినిమాలకీ అలా కుదరదు..’ అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు.

పవన్ కళ్యాణ్ సంపాదన.. అందరికీ తెలిసిన విషయమే. ఆయన కడుతున్న పన్నులే అందుకు నిదర్శనం. రాజకీయాల్లో పారదర్శంగా ఎలా వుండాలో ఆయన ఓ రోల్ మోడల్‌గా చూపిస్తున్నారంతా. దీన్ని కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్లు అభినందించాలి, ఆహ్వానించాలి చేతనైతే.

చేతకానప్పుడు, ఆ విషయం జోలికి కోట వెళ్ళకుండా వుండి వుంటే బావుండేది. స్వర్గీయ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చాక, ఆయన్ని ఎవరూ ‘ప్యాకేజీ స్టార్’ అని విమర్శించలేదు. అప్పటి రాజకీయాలు అలాంటివి. ఆయన్ని ‘కమ్మ’ నాయకుడనీ ఎవరూ అనలేదు. అప్పుడు సంస్కారవంతులున్నారు రాజకీయాల్లో.

కానీ, ఇప్పుడు కుసంస్కారులున్నారు.. కులపిచ్చిగాళ్ళున్నారు. బట్ట కాల్చి మొహాన వేసే సంస్కార హీనులున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పినా, చెప్పకపోయినా.. తనను నమ్ముతున్నవారి ముందు స్వచ్ఛంగా నిలబడాలంటే, తప్పదు.. వాస్తవాల్ని చెప్పాల్సిందే. పవన్ కళ్యాణ్ వాస్తవాలు చెబుతోంటే, కోటకి ఎందుకు కడుపు మంట.? అసలు అది కోట శ్రీనివాసరావుకి సంబంధమే లేని వ్యవహారం కదా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...