Switch to English

క్వారెంటైన్‌ టైంను అఖిల్‌కు కేటాయించిన కొరటాల?

ఆచార్య చిత్రం షూటింగ్‌తో బిజీ బిజీగా ఉండాల్సిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం అయ్యాడు. భరత్‌ అనే నేను సినిమా విడుదలై రెండేళ్లు అయ్యింది. చిరంజీవితో సినిమా అనుకోవడం వల్ల చాలా సమయం కొరటాలకు వృదా అయ్యింది. కెరీర్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్న కొరటాలకు ఇది చాలా పెద్ద గ్యాప్‌ అయ్యింది. ఆచార్యతో ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేయాలని భావించినా మళ్లీ సినిమా ఆలస్యం అవుతూనే ఉంది.

ఆచార్యను ఆగస్టులో విడుదల చేయాలనుకున్నా ఇప్పుడు సాధ్యం అయ్యేలా లేదు. ఆచార్య ఎలాగూ ఆలస్యం అవుతుంది కనుక ఆ తర్వాత సినిమా అయినా ఆలస్యం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో అప్పుడే తదుపరి చిత్రం స్క్రిప్ట్‌ను దాదాపుగా పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల తదుపరి చిత్రం అక్కినేని హీరో అఖిల్‌తో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్‌ ప్రస్తుతం మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రంను చేస్తున్నాడు.

బ్యాచిలర్‌ చిత్రం కూడా ఈ సమ్మర్‌లో విడుదల కావాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అఖిల్‌ తదుపరి చిత్రం కొరటాల దర్శకత్వంలో అంటూ ఇప్పటికే అక్కినేన వర్గాల వారు అనధికారికంగా చెప్పేశారు. సినిమా షూటింగ్‌ మొదలయ్యేది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. కాని వచ్చే ఏడాది చివర్లో మాత్రం సినిమా వచ్చేలా దర్శకుడు కొరటాల శివ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. దర్శకుడు కొరటాల శివ అయిదు సంవత్సరాల్లో తన సినీ కెరీర్‌ కు గుడ్‌ బై చెప్తానంటూ ప్రకటించాడు. అందుకే ఈ లోపు ఎక్కువ సినిమాలు చేయాలని ఖాళీ టైంలో కూడా స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: గొర్రెకుంట మృత్యుబావి మిస్టరీలో మరో ట్విస్ట్.!

ఈ రోజు ఉదయమే వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల మర్డర్ కి కారణమైన సంజయ్ కుమార్ యాదవ్ నిజానిజాలు ఒప్పుకోవడంతో ఈ మృత్యుబావి మిస్టరీ...

రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్‌: నష్టం కోట్లలోనే.!

రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. నెల రోజులపాటు పండగ వాతావరణం కన్పిస్తుంటుంది. కరోనా వైరస్‌ దెబ్బకి రంజాన్‌ ఈసారి వెలవెలబోతోంది. ఇది హైద్రాబాద్‌ పరిస్థితి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ...

టిబి స్పెషల్: రంజాన్ రోజు ముస్లిం సోదరుల ఇంట నోరూరించే టాప్ 10 ఫుడ్స్

రంజాన్ అనేది ముస్లిం సోదరులకు ఇదొక పర్వదినం.. వారి పండుగల్లో చాలా ప్రత్యేకమైనది.. నెల రోజుల ముందు నుంచే ఉపవాసం ఉంటూ, ప్రతి రోజూ నియమనిష్టలతో నమాజ్ చేస్తూ, ఎంతో పవిత్రంగా చేసుకునే...

ఎన్టీఆర్‌ బర్త్‌డే.. నారా లోకేష్‌ రికార్డ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజునాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సరికొత్త రికార్డులు సృష్టించారు.. అదీ సోషల్‌ మీడియాలో. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు...

కేజీఎఫ్‌ విషయంలో అంత పట్టుదల ఎందుకు?

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ప్రపంచంలో పలు దేశాలు లాక్‌ డౌన్‌ అమలు చేశాయి. ఇండియాలో రెండు నెలల పాటు లాక్‌ డౌన్‌ కొనసాగింది. ఇంకా కూడా లాక్‌ డౌన్‌లోనే ఇండియా ఉంది....